I will be a President for all Americans: Joe Biden: న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US election 2020) డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ (Joe Biden) ఘన విజయం సాధించిన తర్వాత.. ఆయన మొదటిసారి ట్విట్ చేశారు. అమెరికా వంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి తనను ఎన్నుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా.. అంటూ జో బిడెన్ ట్విట్ చేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు. ఈ మేరకు జో బిడెన్ ఈ విధంగా ట్విట్ చేశారు.
America, I’m honored that you have chosen me to lead our great country.
The work ahead of us will be hard, but I promise you this: I will be a President for all Americans — whether you voted for me or not.
I will keep the faith that you have placed in me. pic.twitter.com/moA9qhmjn8
— Joe Biden (@JoeBiden) November 7, 2020
‘‘అమెరికా వంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి మీరు నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నలబెట్టుకుంటాను. నేను మీకు హామీనిస్తున్నాను.. మీరు నాకు ఓటు వేసినా.. వేయకపోయినా.. అమెరికన్లందరికీ నేను అధ్యక్షుడిగా ఉంటాను.. అంటూ జో బిడెన్ ట్విట్ చేశారు. Also read: US Elections: జో బిడెన్, కమలా హారిస్‌కు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
హోరాహోరిగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 530 ఎలక్టోరల్ ఓట్లలో జో బిడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డొనాల్డ్ ట్రంప్‌కు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో జో బిడెన్ ఘన విజయాన్ని సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. Also read: US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం
Also read: Kamala Harris: చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక
Also read : US Election Results: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ జో బిడెన్‌దే ఆధిక్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe