America snowfall: మంచులో కూరుకుపోతున్న అమెరికా, ముప్పులో సగం అమెరికా

America snowfall: భారీ హిమపాతం అమెరికాను వణికిస్తోంది. పెద్ద ఎత్తున కురుస్తున్న మంచు ముంచేస్తోంది. జనజీవనం ఇప్పటికే అస్తవ్యస్తమైంది. దాదాపుగా సగం జనాభా ముప్పులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.   

Last Updated : Feb 17, 2021, 12:47 PM IST
  • మంచు ముప్పులో 15 కోట్ల మంది అమెరికన్లు
  • భారీ హిమపాతంతో అతలాకుతలమవుతున్న జనజీవనం
  • మంచుతో కప్పుకుపోయిన అమెరికా, స్థంభించిన రవాణా, నిలిచిపోయిన విమాన సర్వీసులు
America snowfall: మంచులో కూరుకుపోతున్న అమెరికా, ముప్పులో సగం అమెరికా

America snowfall: భారీ హిమపాతం అమెరికాను వణికిస్తోంది. పెద్ద ఎత్తున కురుస్తున్న మంచు ముంచేస్తోంది. జనజీవనం ఇప్పటికే అస్తవ్యస్తమైంది. దాదాపుగా సగం జనాభా ముప్పులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. 

అగ్రరాజ్యం అమెరికా( America )గజగజలాడుతోంది. భారీ హిమపాతం ( Heavy snowfall )తో జనం అల్లాడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో అమెరికా నగరాలు కప్పబడిపోతున్నాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది. ఇప్పటికే విమానాల్ని రద్దు చేసేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు వీల్లేకుండా పోయింది. రహదార్లన్నీ మంచుతో కప్పుకుపోయాయి. దాదాపుగా 15 కోట్ల మంది జనాభా మంచు ముప్పులో చిక్కుకున్నట్టు ది నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించిందంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. అమెరికా మొత్తం జనాభా 32 కోట్లు కాగా..15 కోట్ల మంది ముప్పులో ఉన్నారంటే దాదాపు సగం అమెరికా ప్రమాదంలో పడిపోయినట్టే. టెక్సాస్ ( Texas ) చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికి పైగా అమెరికన్లు నీళ్లు, కరెంట్ లేక అల్లాడిపోతున్నారు. టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. టెక్సాస్‌లో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. విద్యుత్ ప్లాంట్లు పని చేయడం లేదు. పైపుల్లో నీరు సైతం గడ్డకట్టుకుపోయాయి. ప్రజలకు నీళ్లు సైతం అందడం లేదు. 

టెక్సాస్( Texas )రాష్ట్ర గవర్నర్ అయితే నేషనల్ గార్డ్ సహాయం కోరారు. కరెంట్, నీళ్లు పొదుపుగా వాడాలని కన్సాస్ గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఇక కెంటకీలో మరింత బలంగా చలిగాలులు వీచే అవకాశాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే 27 లక్షల మందికి పైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు. లూసియానా, డల్లాస్ రాష్ట్రాల్లో సైతం మంచు బీభత్సం నెలకొంది. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నార్త్ కరోలినాలో తలెత్తిన టోర్నడోలకు ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరి కొద్దిరోజులు భారీ హిమపాతం తప్పదని అమెరికా వాతావరణ శాఖ ( Amerca Weather department ) హెచ్చరించింది. 

Also read: Thames river: 60 ఏళ్లలో తొలిసారి గడ్డకట్టిన నది, చలికి వణికిపోతున్న ఇంగ్లండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News