Covid 19: ఆరడుగులు చాలదు..వైద్య నిపుణుల తాజా హెచ్చరికలు

కరోనా వైరస్ సంక్రమణ ( Corona virus spread )...అంతకంతకూ మారుతున్న వైరస్ రూపం నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందంటున్నారు.

Last Updated : Aug 28, 2020, 10:42 PM IST
Covid 19: ఆరడుగులు చాలదు..వైద్య నిపుణుల తాజా హెచ్చరికలు

కరోనా వైరస్ సంక్రమణ ( Corona virus spread )...అంతకంతకూ మారుతున్న వైరస్ రూపం నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ( Corona virus pandemic ) విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అటు వ్యాక్సిన్ ( Corona vaccine ) అందుబాటులో వచ్చేందుకు ఇంకా సమయం పట్టనుంది.  మరోవైపు వైరస్ పలు చోట్ల తన రూపాన్ని మార్చుకుని మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. ఈ నేపధ్యంలో బీఎంజే మెడికల్ జర్నల్ ( BMJ Medical journal ) లో వైద్య నిపుణులు పలు కీలకమైన విషయాలు వెల్లడించారు. మనిషికి మనిషికి మధ్య ఆరడుగులు దూరం కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలంటున్నారు. కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న క్రమంలో..ఇండోర్ లోనూ, వెలుతురు తక్కువగా ఉన్నచోట ఆరడుగుల కంటే ఎక్కువ దూరం పాటించాల్సిందేనంటున్నారు. మాస్క్ ధరించడం, బయట జనం గడిపే సమయం, జనసాంద్రత వంటి అంశాలు వైరస్ సంక్రమణలో ప్రబావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ  ( World health organisation ) మీటర్ లేదా మూడు అడుగుల దూరం పాటిస్తే సరిపోతుందని చెప్పిన నేపధ్యంలో ఇప్పుుడు వైద్య నిపుణుల తాజా హెచ్చరికలు ( Health experts recent warning on corona virus ) ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆరడుగుల దూరం పాటించినంత మాత్రాన కరోనా వైరస్ సోకదని గ్యారంటీ లేదంటున్నారు. అందుకే వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ప్రజలు మరింత అప్రమత్తంగా...మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. Also read: Corona rapid test kit: కేవలం 3 వందల రూపాయలకే కరోనా టెస్ట్ కిట్

Trending News