Donald Trump First Speech: ఉత్కంఠగా జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన డొనల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిట్ భవనంలో ప్రమాణస్వీకారం చేసిన 78 ఏళ్ల ట్రంప్ తొలి ప్రసంగంతోనే తన లక్ష్యాలు ఏమిటో చెప్పారు. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక కూడా తన నినాదం 'అమెరికా ఫస్ట్'ను పునరుద్ఘాటించారు. అధ్యక్షుడిగా చేసిన తొలి ప్రసంగంపై ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనించాయి. తొలి ప్రసంగంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'అమెరికా ఫస్ట్ అనేదే నా నినాదం. అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది, అనేక సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం' అని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. 'దేశ సరిహద్దుల రక్షణ మనకు చాలా కీలకం. శాంతిభద్రతల విషయంలో మరింత కఠినంగా ఉండాలి' అని స్పష్టం చేశారు. 'అమెరికా విద్యావ్యవస్థలో అనేక మార్పులు రావాలి. అమెరికా పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలి' అని పిలుపునిచ్చారు.
Also Read: Donald Trump: డోనాల్డ్ ట్రంప్ మార్క్ బిగ్‌షాక్.. WHO నుంచి అమెరికా అవుట్, జరిగే నష్టం ఇదే..!
'దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి త్రుటిలో బయటపడ్డా' అని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన కాల్పులను ప్రస్తావించారు. '2025 మనకు స్వేచ్ఛాయుత సంవత్సరం' అని ప్రకటించారు. 'ఎలాంటి సంక్షోభం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందాం. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల కలయికే అమెరికా' అని వివరించారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని ప్రకటించారు. అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తెలిపారు.
రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తాం. అమెరికా దక్షిణ సరిహద్దుల్లో అత్యయిక పరిస్థితి విధిస్తాం . అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం. అమెరికాలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు ఉంటాయి. అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అని అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తన కార్యాచరణ వివరించారు. నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. 'అమెరికన్ డ్రీమ్ అనేది ప్రపంచ నలుమూలల్లోని ప్రతిభావంతుల కల. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎలాంటి వివక్ష ఉండదు' అని స్పష్టం చేశారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. శాంతి నెలకొల్పేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తామని పునరుద్ఘాటించారు.
🚨 DONALD TRUMP SAYS MALE & FEMALE ARE THE ONLY TWO GENDERS
"Only two genders will be recognized in America: male and female" 🇺🇸🔥 #Trump #DonaldTrump pic.twitter.com/BeVLuhE0iU
— Farid Khan (@_FaridKhan) January 20, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.