North Korea Corona: ఉత్తర కొరియాలో కరోనా టెర్రర్..హెల్త్ ఎమర్జెన్సీ విధింపు..!

North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరో వేవ్‌ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలంటోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ఉత్తర కొరియాలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 03:54 PM IST
  • ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్
  • రెట్టింపు అవుతున్న రోజువారి కేసులు
  • ఉత్తర కొరియాలో లాక్‌డౌన్
 North Korea Corona: ఉత్తర కొరియాలో కరోనా టెర్రర్..హెల్త్ ఎమర్జెన్సీ విధింపు..!

North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరో వేవ్‌ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలంటోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ఉత్తర కొరియాలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది.  ఈవిషయాన్ని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఉత్తర కొరియాలో కరోనా పరీక్షలు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. లక్షణాల ఆధారంగానే వైరస్‌ను నిర్ధారిస్తున్నామంటున్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు. కరోనా వల్ల 50 మంది మృత్యువాత పడ్డారని అధికారిక ప్రకటన వచ్చింది. మృత్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు.  

ఉత్తర కొరియాలో పరిస్థితి చేయి దాటి పోకుండా లాక్‌డౌన్ విధించారు. ఆ దేశ అధినేత కిమ్ ఎమర్జెన్సీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఇదివరకే ఏర్పాటు చేశారు. దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. పరిస్థితి చేయి దాటిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందుల సరఫరాలో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సరైన చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కోర్‌ రంగంలోకి దిగింది.

ఉత్తర కొరియా(North Korea) ఎలాంటి సాయమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే దక్షిణ కొరియా తెలిపింది. ఇటీవల ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. అప్పటికే వైరస్ ఉధృతి పెరిగి ఉంటుందని వైద్యలు అంచనా వేస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు హెల్త్ ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. టీకా ఉద్యమాన్ని సైతం ఉధృతం చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, చైనా తయారీ టీకాలను పరిశీలించారు. ఐతే లాక్‌డౌన్‌తోనే వైరస్ చెక్‌ పెట్టొచ్చని ఉత్తర కొరియా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది.

Also read: Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఒరిగిందేంటి..?

Also read: Ambati Retirement: రాయుడు వ్యవహారం టీ కప్పులో తుపాను లాంటిది.. అంతా బానే ఉంది: చెన్నై కోచ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News