Christmas Celebrations: తొలిసారి ఏసు క్రీస్తు వేడుకలకు దూరంగా బెత్లెహాం నగరం, కారణమేంటి

Christmas Celebrations: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ఒక్క ఆ ప్రాంతంలో తప్ప. ఎక్కడ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరగాలో అక్కడీసారి కళ తప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2023, 12:51 PM IST
Christmas Celebrations: తొలిసారి ఏసు క్రీస్తు వేడుకలకు దూరంగా బెత్లెహాం నగరం, కారణమేంటి

Christmas Celebrations: డిసెంబర్ 25. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు. క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతున్నా క్రీస్తు పుట్టిన చోట ప్రాంతం మాత్రం తొలిసారి పండుగకు దూరమైంది. ఎందుకీ పరిస్థితి..అసలేం జరిగింది.

క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసు క్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్. 25. అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ప్రపంచమంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చాలా ప్రాంతాల్లో వారం రోజుల తరబడి క్రిస్మస్ సంబరాలు జరుగుతుంటాయి. ఒకరి కొకరు పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ రంగు రంగుల విద్యుత్ లైట్లతో అత్యంత సుందరంగా అలంకరించి ఉన్నాయి. ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ ప్రత్యేక సంబారాలు జరుగుతున్నాయి. కానీ క్రీస్తు పుట్టిన ప్రాంతం మాత్రం తొలిసారిగా కళ తప్పి కన్పిస్తోంది. పండుగ సందడే కన్పించడం లేదు. 

పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని బెత్లెహాం నగరం ఏసు క్రీస్తు జన్మస్థలం. ప్రతి యేటా క్రిస్మస్ ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతుంది. క్రీస్తు పుట్టిన ప్రాంతం కావడంతో ఇక్కడికొచ్చి క్రిస్మస్ జరుపుకోవడాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. బెత్లెహాం నగరమంతా ముస్తాబవుతుంటుంది. రంగు రంగుల విద్యుత్ దీపాల అలంకరణతో నిండిపోతుంది. బెత్లెహాం నగరంలోని మేంజర్ స్క్వేర్‌లో కన్పించే ప్రత్యేక అలంకరణ మొత్తం క్రిస్మస్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 

తొలిసారిగా క్రిస్మస్ వేడుకకు క్రీస్తు పుట్టిన ప్రాంతం దూరమైంది. మేంజర్ స్క్వేర్ ప్రాంతం కళ తప్పి కన్పిస్తోంది. విద్యుత్ అలంకరణలుండాల్సిన స్థానంలో ముళ్ల కంచెలు, శిధిలాలు కన్పిస్తున్నాయి. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంతో క్రీస్తు వేడుకలు రద్దయ్యాయి. వేలాది పర్యాటకులతో కళకళలాడాల్సిన బెత్లెహాం నగరం ఇప్పుడు సైనికుల కవాతుతో కన్పిస్తోంది. నగరంలో ఇప్పుడు క్రిస్మస్ చెట్లు, విద్యుత్ వెలుగుల్లేవు. తుపాకీ చప్పుళ్లు, సైన్యం కవాతు, అంధకారం కన్పిస్తోంది. ఈ పరిస్థితి బెత్లెహాం ఆర్ధిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. బెత్లెహాం ఆదాయంలో 70 శాతం విదేశీ పర్యాటకుల్నించే వస్తుంటుంది. ఇదంతా క్రిస్మస్ సీజన్‌లో వచ్చే ఆదాయమే కావడం విశేషం. 70-80 శాతం హోటల్స్ మూతపడ్డాయి.

ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో ఉన్న బెత్లెహాంలో క్రిస్మస్ వేడుకలపై అక్కడి పాలకులు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ప్రతిసారీ తప్పని పరిస్థితుల్లో అడ్డుకోలేని పరిస్థితుల వల్ల క్రిస్మస్ అత్యంత ఘనంగా జరుగుతుంటుంది. వాస్తవానికి యూదుల్లో మెజార్టీ వర్గం క్రిస్మస్ వేడుకలు జరపదు. ఎందుకంటే క్రీస్తును విశ్వసించరు. యూదుల్లో మెసానిక్ యూదులు మాత్రమే క్రీస్తును నమ్మి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంటారు. ఇప్పుడు యుద్ధం వంకతో మొత్తం వేడుకలే రద్దయ్యాయి.

Also read: INS Imphal: రేపు పశ్చిమ నావికాదళంలో చేరనున్న క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News