COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్‌పై మరో కుట్రకు తెరతీసిన చైనా : అమెరికా

హైద‌రాబాద్‌: క‌రోనావైర‌స్ వ్యాప్తికి కారణమైన చైనా (China ) తాజాగా మరో కుట్రకు తెరతీసిందని అమెరికా ఆరోపిస్తోంది. కరోనావైరస్ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) త‌యారు చేస్తోన్న బయోటెక్ సంస్థలపై హ్యాకింగ్ చేయడం ద్వారా చైనా హ్యాకర్స్ సైబ‌ర్ దాడులకు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది.

Last Updated : Jul 22, 2020, 09:33 PM IST
COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్‌పై మరో కుట్రకు తెరతీసిన చైనా : అమెరికా

హైద‌రాబాద్‌: కరోనావైరస్ వ్యాప్తికి కారణమైన చైనా (China ) తాజాగా మరో కుట్రకు తెరతీసిందని అమెరికా ఆరోపిస్తోంది. కోవిడ్-19 వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) త‌యారు చేస్తోన్న బయోటెక్ సంస్థలపై హ్యాకింగ్ చేయడం ద్వారా చైనా హ్యాకర్స్ సైబ‌ర్ దాడులకు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది. చైనాకు చెందిన ఈ హ్యాకర్స్‌కి చైనా ఇంటెలీజెన్స్ ఏజెంట్స్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు అమెరికా గుర్తించింది. అమెరికాతో పాటు ఇత‌ర దేశాల్లోనూ కొవిడ్-19 టీకాపై ప‌రిశోధనలు చేస్తోన్న రిసెర్చ్ సెంటర్స్‌పై చైనా సైబర్ దాడుల‌కు ( Cyber attacks ) పాల్ప‌డుతున్న‌ట్లు అమెరికా న్యాయ‌శాఖ స్పష్టంచేసింది. ఈ కేసులో చైనాకు చెందిన లీ జియావూ (34), డాంగ్ జియాజి(33) అనే ఇద్దరు హ్యాకర్స్‌పై కేసు న‌మోదైంది. ఈ మేరకు అమెరికా నేర పరిశోధన సంస్థ ఎఫ్‌బీఐ ( FBI ) ఆ ఇద్దరి ఫోటోలను విడుదల చేయగా.. అమెరికా అసిస్టెంట్ అటార్నీ జ‌న‌ర‌ల్ జాన్ డీమ‌ర్స్ చైనీస్ హ్యాకర్స్ చేస్తోన్న సైబర్ దాడులపై పలు విషయాలు వెల్లడించారు. ( Also read: Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది )

అమెరికాలోని మ‌సాచుసెట్స్ బ‌యోటెక్ సంస్థ‌పై లీ జియావూ, డాంగ్ జియాజి జ‌న‌వ‌రిలోనే సైబ‌ర్ దాడికి పాల్పడిన‌ట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికాలో కొవిడ్‌-19 టీకాపై ప‌రిశోధ‌న‌లు చేపడుతున్న సంస్థలో ఒకటైన మసాచుసెట్స్ బయోటెక్ సంస్థను లక్ష్యంగా చేసుకుని చైనీస్ హ్యాకర్స్ హ్యాకింగ్‌కి ( Hacking ) పాల్పడ్డారని... అలాగే మేరీల్యాండ్ కంపెనీకి చెందిన డేటాను సైతం హ్యాకింగ్ చేశారనేది ఎఫ్‌బీఐ చేస్తోన్న ఆరోపణ. అమెరికా చేస్తోన్న ఈ ఆరోపణను చైనా ఎలా తిప్పికొడుతుందో వేచిచూడాల్సిందే మరి. ( Also read: COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఏయే దేశాలు ముందున్నాయి.. సమగ్ర కథనం )

Trending News