Covid19 To Cat: యూకేలో పిల్లికి కోవిడ్-19 నిర్ధారణ

CoronaVirus Outbreak: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వణికిస్తున్న కరోనావైరస్ ( Coronavirus ) సుమారు ఆరు లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. మనుషుల పాలిట కాలయముడిలా మారిన కోవిడ్-19 ( Covid-19) జంతువులకు కూడా సోకుతున్నట్టుగా వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. 

Last Updated : Jul 28, 2020, 06:53 PM IST
Covid19 To Cat: యూకేలో పిల్లికి కోవిడ్-19 నిర్ధారణ

CoronaVirus Outbreak: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వణికిస్తున్న కరోనావైరస్ ( Coronavirus ) సుమారు ఆరు లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. మనుషుల పాలిట కాలయముడిలా మారిన కోవిడ్-19 ( Covid-19) జంతువులకు కూడా సోకుతున్నట్టుగా వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. తాజాగా యూకేలో (United Kingdom ) ఇలాంటిదే ఒక కేసు నమోదు అయింది.  అక్కడ ఒక పిల్లికి కరోనావైరస్ ( Coronavirus to Cat ) సోకింది. ఈ వార్త ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం మనుషులకే ప్రమాదం పొంచి ఉంది అనుకున్నారు. అయితే తాజా ఘటన కలవరపెడుతోంది.

Read This Story Also: IRCTC: ఇక ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం చాలా సులభం

యూకేకు చెందిన ఒక వ్యక్తి తన పిల్లి శ్వాస తీసుకోవడానికి ( Breathing Issues ) ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి దాన్ని ఇంగ్లాండ్  వేబ్రిడ్జ్ దగ్గరున్న వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్తాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు రిపోర్టు చూసి షాక్ అయ్యారు. పిల్లికి కరోనావైరస్ ఎలా సోకింది అని దర్యాప్తు చేయగా దాని యజమాని కూడా కోవిడ్19 నిర్ధారణ జరిగింది అని తెలిసింది. అయితే మనుషుల ద్వరా జంతువులకు వైరస్ సోకుతుందా లేదా అనేది ఇప్పటికీ తేలని విషయం అని వైద్యులు చెబుతున్నారు.
Read This Story Also: Ala vaikunthapurramuloo: అల వైకుంఠపురములో హిందీ హీరో ఎవరో తెలుసా? 

Trending News