Japan Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం.. పొంచి ఉన్న సునామీ ముప్పు

Japan Tsunami Tension After 6 9 Magnitude Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ద్వీపకల్ప దేశంగా ఉన్న జపాన్‌లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదవడం కలకలం రేపింది. ఈ సందర్భంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 14, 2025, 09:28 AM IST
Japan Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం.. పొంచి ఉన్న సునామీ ముప్పు

Japan Earthquake: ద్వీపకల్ప జపాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9 గా నమోదైందని జపాన్‌ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా మియాజాకితోపాటు కొచీ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే భూకంపంతో ఏర్పడిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ భూకంపం దాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిత్యం భూప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Also Read: Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌ రావు సంచలనం.. తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌

సోమవారం చోటుచేసుకున్న భూ ప్రకంపనల భయంతో ప్రజలు ఇళ్లలో ఉండలేకపోయారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9.19 గంటలకు భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ద్వీపం క్యుషు.. దాని సమీపంలోని కొచ్చి ప్రిఫెక్చర్‌లో ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. అయితే భూంకంపం ధాటికి ఎంతమేరకు నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. భూకంప కేంద్రం సముద్రంలో 48 కిలోమీటర్లు లోతులో కేంద్రీకృతమైనట్లు ప్రకటించింది. భూకంపం ధాటికి సముద్రంలో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గతేడాది ఇదే చోట రెండు సార్లు భూకంపం సంభవించినా ఎటువంటి ఆస్తి.. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జరిగిన భూకంపం తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుందని ప్రజలు భావించారు. కానీ అలాంటి ఆస్తి, ప్రాణ నష్టం ఎలాంటిది సంభవించలేదని జపాన్ వాతారణ శాఖ 

చుట్టూ సముద్ర జలాలు ఉండడంతో జపాన్‌కు భూకంపం హెచ్చరికలు ఉంటాయి. సముద్రం, భూమి మధ్య ఏర్పడిన సంఘర్షణతో ఇలాంటి భూకంపాలు చోటుచేసుకుంటాయని శాస్త్రవేతల్తలు చెబుతున్నారు. కానీ తాజాగా సంభవించిన భూంకంపంతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జపాన్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి నివసించాలని సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News