/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

AstraZeneca COVID-19 Vaccine: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకొస్తున్న వ్యాక్సిన్లతో ప్రాణాలకు ముప్పు అని ప్రారంభ దశలో ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నేటికి కొందరిలో భయాలు పోలేదు. కోవ్యాగ్జిన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటరీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా యూకేలో ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొందరికి రక్తం గడ్డ కట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని యూకే ఔషధ నియంత్రణ సంస్థ సైతం నిర్ధారించింది. కోట్లాది ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వగా కొందరిలో దాని దుష్రభావం కనిపించడం సాధారణమేనని మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యూలేటరీ ఏజెన్సీ వెల్లడించింది. మార్చి 24వ తేదీ వరకు మొత్తం 1.81 కోట్ల మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వగా మొత్తం 30 మందికి రక్తం గడ్డ కట్టింది. వారికి వైద్యులు అందించిన చికిత్స ఫలితం అందించకపోవడంతో 7 మంది ప్రాణాలు కోల్పోయారని యూకే ఔషధ నియంత్రణ సంస్థ ప్రకటించింది.

Also Read: Gold Price Today 04 April 2021: మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు

ప్రపంచ వ్యాప్తంగా ఏ వ్యాధి నిర్మూలన కోసమైనా వైద్యశాస్త్రం చేసే యత్నాలతో వ్యాక్సిన్లు రూపొందుతాయి. అయితే దానివల్ల కోట్లాది మందికి ప్రయోజనం చేకూరనుండగా, కొందరికి మాత్రం వికటిస్తుందని హెల్త్ రెగ్యూలేటరి తెలిపింది. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో సెరెబ్రల్ వెనాస్ సైనస్ థర్మోబయాసిస్ లక్షణాలు కనిపించడంతో రక్తం గడ్డ కట్టింది. అదే సమయంలో ఫైజర్ బయో‌ఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న ఒక్కరిలో కూడా రక్తం గడ్డ కట్టడం లాంటి కేసులు నమోదు కాలేదని యూకే రెగ్యూలేటరీ స్పష్టం చేసింది. 

Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి

కాగా, వ్యాక్సిన్లు తీసుకున్న అనంతరం ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే సాధ్యమైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తం గడ్డ కట్టే కేసులు 62 నమోదుకాగా, అందులో 44 కేసులు యూరోప్‌లో నమోదైనట్లు సమాచారం. ఆ ప్రాంతంలో 9.2 మిలియన్ల మందికి ఆస్ట్రాజెనెకా టీకాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
AstraZeneca COVID-19 Vaccine: 7 Deaths In UK Recipients After AstraZeneca Due To Blood Clots
News Source: 
Home Title: 

COVID-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుని రక్తం గడ్డకట్టడంతో ఏడుగురు మృతి

COVID-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుని రక్తం గడ్డకట్టడంతో ఏడుగురు మృతి
Caption: 
AstraZeneca COVID-19 Vaccine
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
COVID-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుని రక్తం గడ్డకట్టడంతో ఏడుగురు మృతి
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Sunday, April 4, 2021 - 09:11
Request Count: 
148
Is Breaking News: 
No