America Wild Fire: మరోసారి అమెరికాలో చెలరేగిన కార్చిర్చు.. వైల్డ్ ఫైర్ కారణంగా లాస్ అయిన లాస్ ఏంజెల్స్..

America Wild Fire:అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. తాజాగా ఈ మంటలు మరింతగా చెలరేగి, భారీ నష్టాలను కలిగించాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 24, 2025, 08:55 AM IST
America Wild Fire: మరోసారి అమెరికాలో చెలరేగిన కార్చిర్చు.. వైల్డ్ ఫైర్  కారణంగా లాస్ అయిన లాస్ ఏంజెల్స్..

America Wild Fire: అమెరికాలో వైల్డ్ ఫైర్ మరోసారి అక్కడ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. స్థానిక మీడియాకు అందిన వివరాల ప్రకారం లాస్ ఏంజిల్స్ కౌంటీలో మరోసారి అటవీ మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు.కాస్టిక్ లేక్‌  సమీపంలోని కొండ ప్రాంతంలో ముందుగా మంటలు చెలరేగాయి. ఇప్పుడవి ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాప్తి చెందాయి.

మరోమారు చెలరేగిన ఈ మంటలు కేవలం రెండు గంటల్లోనే 5,000 ఎకరాల ప్రాంతాన్ని కాల్చి బూడిద చేశాయి. శాంటా అనాలో వీచే గాలులు మంటలు చెలరేగడానికి కారణంగా నిలిచాయి. మంటల నుండి వచ్చే పొగ కారణంగా పెద్ద నల్లటి మేఘాలు ఏర్పడుతున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ మంటల కారణంగా ఏ ఇల్లు లేదా వ్యాపారం దెబ్బతినలేదు. కానీ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 19 వేల మందిని  అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఈ నెల ప్రారంభంలో చెలరేగిన మంటల కారణంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. తాజాగా శాన్ డియాగో, ఓషన్‌సైడ్ సమీపంలో దక్షిణాన మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. వీటిని అగ్నిమాపక శాఖ అదుపు చేసిందన్నారు. లాస్ ఏంజిల్స్‌లో వీస్తున్న గాలుల కారణంగా మంటలు పదే పదే ఎగసిపడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అక్కడ గంటకు 20 నుండి 30 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

దీని కారణంగా మంటలను ఆర్పడం అగ్నిమాప దళానికి, వైమానిక దళానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు వారి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 22 వేల ఇళ్లు బూడిదయ్యాయి.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News