Mass Arrests in America: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే తీసుకోబోయే కీలకమైన నిర్ణయాల్లో ముఖ్యమైంది వలసదారులపై వేట. దేశవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ అరెస్టులు ప్రారంభించనున్నారు. అమెరికాను ఇమ్మిగ్రేషన్ ఫ్రీ చేయడమే ట్రంప్ లక్ష్యంగా కన్పిస్తోంది.
ఊహించిందే జరిగేలా కన్పిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించగానే దేశవ్యాప్తంగా వలసదారులై ఉక్కుపాదం మోపేందుకు ట్రంప్ సిద్దమయ్యారు. దేశవ్యాప్తంగా వలసదారులపై వేట మొదలెట్టి సామూహికంగా అరెస్టులు సైతం చేయనున్నారు. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది అక్రమ వలసదారుల్ని ట్రంప్ బహిష్కరించనున్నారు. ఇమ్మిగ్రేషన్ దాడుల్ని బోర్డర్ జార్ పేరుతో చికాకూ నుంచి ప్రారంభించవచ్చని సమాచారం. వారం రోజులు జరిగే ఇమ్మిగ్రేషన్ దాడుల ప్రక్రియలో దాదాపుగా 200 మంది అధికారులు పాల్గొననున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశలవారీగా వలసదారుల ఏరివేత కార్యక్రమం కొనసాగనుంది. కాగితాలు లేని వారందరినీ అరెస్ట్ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా అతి పెద్ద దాడి జరగనుందని మాజీ ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. చట్ట విరుద్ధంగా దేశంలో ఆశ్రయం పొందినవారికి సమస్య ఎదురు కానుంది. ఎందుకంటే వలసల విషయంలో ఎవరినీ విడిచి పెట్టేది లేదంటున్నారు డోనాల్డ్ ట్రంప్. జో బిడెన్ పాలనలో కూడా ఎలాంటి కాగితాల్లేని 2 లక్షల 71 వేలమంది వలసదారుల్ని బహిష్తరించారు. ఈసారి మరెంతమందిని ఏరివేస్తారో చూడాలి.
Also read: NEET UG 2025 Update: నీట్ పరీక్ష రాస్తున్నారా, అయితే ఈ పని త్వరగా పూర్తి చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి