Boneless Chicken: కర్రీ పేరు తప్పట..పేరు మార్చాలని తీర్మానం

ఊరు పేరు మార్చడానికో..లేదా రాష్ట్రం లేదా దేశం పేరు మార్చడానికో తీర్మానాలు జరుగుతుంటాయి చట్టసభల్లో. కానీ అక్కడ మాత్రం ఏకంగా చికెన్ కర్రీ పేరు మార్చేందుకు తీర్మానమైంది. 

Last Updated : Sep 4, 2020, 07:38 PM IST
Boneless Chicken: కర్రీ పేరు తప్పట..పేరు మార్చాలని తీర్మానం

ఊరు పేరు మార్చడానికో..లేదా రాష్ట్రం లేదా దేశం పేరు మార్చడానికో తీర్మానాలు జరుగుతుంటాయి చట్టసభల్లో. కానీ అక్కడ మాత్రం ఏకంగా చికెన్ కర్రీ ( Chicken curry ) పేరు మార్చేందుకు తీర్మానమైంది. 

మాంసాహార ప్రియులకు వెంటనే గుర్తొచ్చేది చికెన్. చికెన్ లో చాలా రకాలైన వంటలు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రపంచంలో ఇంచుమించు అన్నిచోట్ల ఒకే పేరుతో ఉన్నచికెన్ వంటకం పేరు బోన్ లెస్ చికెన్ ( Boneless chicken ). ఇప్పుడీ పేరు ఆ వ్యక్తికి ఇబ్బందిగా మారింది. కాదు కాదు..అలా పిలవడం తప్పంటున్నాడు. మార్చాలని డిమాండ్ చేశాడు. ఏకంగా లింకన్ సిటీ కౌన్సిల్ ( Lincoln city ) లో తీర్మానం కూడా చేశాడు.

నెబ్రాస్కాకు చెందిన అండర్ క్రిస్టిన్ సన్ లింకన్ సిటీ కౌన్సిల్ లో సభ్యుడు. లింకన్ సిటీ కౌన్సిల్ లో ఇతనో వింత ప్రతిపాదన చేశాడు. అది అందర్నీ ఆశ్చర్యం కలిగించింది. తీర్మానం చదువుతున్నప్పుడు సభ్యులంతా నవ్వుతుంటే..వెనక్కి తిరిగి వారించాడు కూడా. బోన్ లెస్ చికెన్ పేరు మార్చాలనేది ఆ తీర్మానం సారాంశం. వాస్తవానికి బోన్ లెస్ చికెన్ వింగ్స్ అనేది చికెన్ వింగ్స్ నుంచి రాదని...చికెన్ లోని బ్రెస్ట్ ప్రాంతం నుంచి వస్తుందని వివరించాడు. కాబట్టి బ్రెస్ట్ ప్రాంతంలో బోన్స్ ఉండే అవకాశమే లేదని..అందుకే పేరు మార్చాలని తీర్మానంలో ప్రతిపాదించాడు. అంతేకాదు..చాలా కాలంగా అందరూ అబద్ధాలతో బతికేస్తున్నామని...ఇకనైనా పేరు మార్చాలని కోరాడు. Also read: Earth Quake: జపాన్ లో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు

Trending News