Kerala Girl Killed In US: అమెరికాలో జరిగిన కాల్పుల్లో కేరళ యువతి మృతి

Kerala Girl Killed In US: అమెరికాలోని అలబామాలో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న కేరళ యువతిపై కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే మరణించింది. పోస్ట్ మార్టమ్ పూర్తవ్వగానే మృతదేహాన్ని ఇండియాకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 07:21 PM IST
    • అమెరికాలోని అలబామాలో ఘోరం
    • కాల్పుల్లో మరణించిన కేరళ యువతి
    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Kerala Girl Killed In US: అమెరికాలో జరిగిన కాల్పుల్లో కేరళ యువతి మృతి

Kerala Girl Killed In US: యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఘోరం జరిగింది. అమెరికాలోని అలబామా రాజధాని మోంట్ గోమోరీలో కేరళకు చెందిన 19 ఏళ్ల యువతి హత్యకు గురైంది. సుసాన్ మాథ్యూ అనే యువతి.. తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తన ఇంటి పైకప్పు నుంచి దూసుకొచ్చిన ఓ బుల్లెట్ తన తలకు తగిలి అక్కడికక్కడే మరణించిందని స్థానిక పోలీసులు తెలిపారు.

సంఘటన స్థలానికి చేరుకున్న మోంట్ గోమేరి పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మలంకర ఆర్థోడాక్స్ చర్చ్ కు చెందిన ఫ్రాన్సిస్ జాన్సన్ పప్పాచన్ వివరణ మేరకు.. రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో తన ఇంటిపై నుంచి తుపాకి పేలిన శబ్దం వినిపించిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత వెళ్లి చూడగా.. అప్పటికే సుసాన్ మాథ్యూ చనిపోయి ఉందని పేర్కొన్నారు.

మరియం సుసాన్ మాథ్యూ.. కేరళలోని పతనం తిట్ట జిల్లా నిరాణంకు చెందిన బోబెన్ మాథ్యూ కుమార్తె. పోస్ట్ మార్టమ్ అయిపోయిన తర్వాత ఆమె మృత దేహాన్ని కేరళకు తరలించనున్నట్లు స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. ఇది హత్య లేదా అనుకోకుండా బుల్లెట్ వచ్చి ఆమె తలకు తగిలిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: Who Is Parag Agrawal: ఈ పరాగ్ అగర్వాల్ ఎవరు?- టాప్-5 దిగ్గజ కంపెనీల్లో ఇండియన్స్ హవా?

Also Read: Pakistani Model Photoshoot: కర్తార్ పూర్ గురుద్వారా ఎదుట ఫొటోషూట్.. వివాదంలో పాకిస్తానీ మోడల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News