కరోనాతో 15 మంది ఎన్నారైలు మృతి

కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 15 మంది ప్రవాస భారతీయులు చనిపోయారు. విదేశాల్లో చనిపోయిన వారిలో అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్యే అత్యధికంగా ఆరుగురు ఉన్నారు. కరోనా వైరస్‌తో మృత్యువు విళయతాండవం చేసిన ఇటలీలో ఐదుగురు చనిపోగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) ఇద్దరు, ఇరాన్ (Iran), ఈజిప్టులో (Egypt) ఒకరు చొప్పున చనిపోయారు.

Last Updated : Apr 4, 2020, 07:27 PM IST
కరోనాతో 15 మంది ఎన్నారైలు మృతి

న్యూ ఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 15 మంది ప్రవాస భారతీయులు చనిపోయారు. విదేశాల్లో చనిపోయిన వారిలో అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్యే అత్యధికంగా ఆరుగురు ఉన్నారు. కరోనా వైరస్‌తో మృత్యువు విళయతాండవం చేసిన ఇటలీలో ఐదుగురు చనిపోగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) ఇద్దరు, ఇరాన్ (Iran), ఈజిప్టులో (Egypt) ఒకరు చొప్పున చనిపోయారు. కోవిడ్ పాజిటివ్ (COVID-19 positive) వచ్చిందనే భయాందోళనతో స్విడెన్‌‌లో (Sweden) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇరాన్‌లో చనిపోయిన భారతీయుల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. అలాగే ఇక్కడున్న భారతీయుల యోగక్షేమాల కోసం ఇరాన్‌లో ఉన్న ఇండియన్ మిషన్ కృషి చేస్తోంది. ఇరాన్‌లోని క్వామ్ సిటీలో భారతీయులు అత్యధిక సంఖ్యలో కరోనా బారిన పడ్డారు.

Read also : కరోనావైరస్‌ను ఓడించిన 93 ఏళ్ల వృద్ధ దంపతులు

ప్రపంచ దేశాల్లో తొలుత ఎక్కువగా కరోనాబారిన పడిన చైనా, జపాన్, ఇరాన్, ఇటలీ దేశాల నుండి 2500పైగా మంది ఎన్నారైలను భారత ప్రభుత్వం తిరిగి ఇండియాకు తీసుకొచ్చింది. గత వారం ప్రధాని నరేంద్ర మోదీ సైతం విదేశాల్లో ఉన్న భారత రాయబారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. దాదాపు 75 నిమిషాల పాటుకొనసాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో విదేశాల్లో ఉన్న భారతీయులను సకాలంలో అక్కడి నుండి ఖాళీ చేయించి భారత్‌కి రప్పించడంలో కీలక పాత్ర పోషించిన అక్కడి రాయబారులను ప్రధాని ప్రశంసించారు. ఈ సమావేశంలో బీజింగ్, వాషింగ్టన్ డీసీ, టెహ్రాన్, రోమ్, బెర్లిన్ ఖాత్మండు, అబు ధాబి, కాబూల్, మాలి, సియోల్‌లో ఉన్న రాయభారులు ప్రధాని మోదీతో మాట్లాడి అక్కడి ప్రస్తుత పరిస్థితులను వివరించారు.

Read also : Plasma collection: కోలుకున్న వాళ్ల ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్ రోగులకు ఎక్కించే వైద్యం

యూరప్ తర్వాత అమెరికాలోనే కరోనా మృత్యుకేళి ఎక్కువగా ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పటివరకు కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 7000 దాటిందంటే అక్కడి దుస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News