Heavy Rains: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, చెరువులు పొంగుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భీంగల్ మండలంలోని నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆటోలో ఆర్మూర్ తరలించేందుకు బయల్దేరగా...పల్లికొండ చెరువు నీరు రోడ్డుపై చేరడంతో రోడ్డు దాటలేని పరిస్థితి నెలకొంది. అందుబాటులో ఉన్న జేసీబీ సాయంతో గర్భిణీని రోడ్డు దాటించారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Heavy Rains: నిండు గర్భిణీకి వరద కష్టాలు..