Ambati Rambabu Comments On Chandrababu Davos Tour: దావోస్ పర్యటనలో చంద్రబాబు, నారా లోకేశ్ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సింగడు అద్దంకి వెళ్లి వచ్చినట్టు చంద్రబాబు అక్కడకు వెళ్లి వచ్చాడు తప్ప ఏపీకి తీసుకువచ్చింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.