YSRTP President YS Sharmila Strong Counter to CM KCR: తెలంగాణ రిపబ్లిక్ డే వివాదంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. దొర గారి బహిరంగ సభలకు అడ్డురాని కరోనా వైరస్ మహమ్మారి.. గణతంత్ర వేడుకలకు అడ్డొచిందట అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేదా తాలిబన్ రాజ్యానికి అధిపతా? అని ప్రశ్నించారు. తెలంగాణాలో అమలయ్యేది రాజ్యాంగం కాదని, కల్వకుంట్ల రాజ్యాంగమే అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి గైడ్ లైన్స్ కారణంగా గత రెండేళ్లుగా గణతంత్ర దినోత్సవ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్‌లో కాకుండా.. రాజ్‌భవన్‌లోనే నిర్వహించారు. ఈసారి గణతంత్ర వేడుకల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు వేడుకలను నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య ఉన్న విబేధాలు కూడా సందిగ్ధతను మరింత తీవ్రతరం చేసాయి. ఈ పరిస్థితుల్లో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరిస్తూ.. గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించకపోవడంపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. జనవరి 13వ తేదీన రాజ్‌భవన్‌కు లేఖ రాశామని, రాష్ట్రంలో కరోనా ఉన్నందున రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలని కోరినట్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. వేడుకలపై కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. పరేడ్‌తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది.
తాజాగా ఈ విషయంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ... 'దొర గారి బహిరంగ సభలకు అడ్డురాని కరోనా వైరస్.. గణతంత్ర వేడుకలకు అడ్డొచిందా. కరోనా కారణంగా వేడుకలు నిర్వహించడం లేదంటే హాస్యపదంగా ఉంది. అసలు కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక తాలిబన్ రాజ్యానికి అధిపతా?. ఇదేనా భారత రాజ్యాంగంపై కేసీఆర్‌కు ఉన్న గౌరవం. గవర్నర్ గారికి మీకు పడకుంటే వేడుకలు ఆపేస్తారా?. రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పిన నాడే మీరు దేశ ద్రోహులని అర్థమైంది. తాజాగా ఇప్పుడు రుజువైంది. హైకోర్టు ఆదేశాలు కూడా మీకు లెక్కలేవంటే.. తెలంగాణలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు, కల్వకుంట్ల రాజ్యాంగమే' అని ఫైర్ అయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.