YS Sharmila: సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే.. రాజీనామా చేసి వెళ్లిపోవాలి: వైఎస్ షర్మిల

YS Sharmila On CM KCR: సీఎం కేసీఆర్‌పై వైఎఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని.. పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి లేదా ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా వైఎస్ఆర్టీపీ ఆఫీసులో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 03:24 PM IST
  • రిపబ్లిక్ డే వేడుకల్లో వైఎస్ షర్మిల
  • తెలంగాణలో నియంత పాలన
  • సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
YS Sharmila: సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే.. రాజీనామా చేసి వెళ్లిపోవాలి: వైఎస్ షర్మిల

YS Sharmila On CM KCR: దేశ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అన్ని దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని.. భిన్నత్వాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చింది మన రాజ్యాంగం అని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా వైఎస్ఆర్టీపీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

'రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణవాదంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ సర్కార్ రాజ్యాంగాన్ని గౌరవిస్తుందా..? కేసీఆర్‌కు రాజ్యాంగం మీద గౌరవం ఉందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని మార్చాలని అవమానించిన వ్యక్తి కేసీఆర్. ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు ఇచ్చి నిలబెట్టుకోకుండా నియంతగా పాలిస్తున్నాడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా..? రైతులకు రుణమాఫీ చేయడానికి, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడానికి, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు దానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా..?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.  

భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను ప్రజలను అవమానించిన వ్యక్తి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు, ప్రతిపక్షాలు గొంతెత్తితే దాడులు చేయడం, అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తెలంగాణలో భారత రాజ్యాంగం కంటే కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందన్నట్లు ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గణతంత్ర్య వేడుకలను విస్మరించి కేసీఆర్ తెలంగాణ ప్రజలనే కాదు దేశ ప్రజలను రాజ్యాంగాన్ని అగౌరవపరిచారని అన్నారు.

'ఎంతో వైభవంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరగాల్సిన రిపబ్లిక్ డేను నిర్వహించకుండా దిగజారుతున్నారు. మహిళ అని కూడా చూడకుండా గవర్నర్ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా అగౌరవపరుస్తున్నారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఆలోచించాలి. రిపబ్లిక్ డేను గౌరవించని ముఖ్యమంత్రి దేశాలను ఏలతారట. గవర్నర్ గారిని అగౌరపర్చినందుకు గవర్నర్ గారికి, రిపబ్లిక్ డేను విస్మరించినందుకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.
 
గవర్నర్ గారిని ఇంతగా అవమానపర్చినందుకు గవర్నర్ గారికి మేం సంపూర్ణ సానుభూతి తెలుపుతున్నాం. కేసీఆర్‌కు నియంత పాలన అలవాటైపోయింది. ప్రతిపక్షాలు ఏళ్లుగా బాధ్యత సరిగా నిర్వహించకపోవడం వల్లనే కేసీఆర్ నియంత పాలన కొనసాగుతుంది. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి లేదా ఎన్నికలకు పోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తున్నాం..' అని వైఎస్ షర్మిల అన్నారు.

Also Read: President Droupadi Murmu Speech: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Also Read: Keeravani Honoured with Padma : కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. కీరవాణికి అవార్డుల వర్షంపై రాజమౌళి ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News