SHARMILA COMMENTS: సినిమాలు, షోలు చూస్తూ కాలక్షేపం చేస్తారా?కేటీఆర్ కు సిగ్గులేదా?

SHARMILA COMMENTS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. వరదలు వచ్చి రైతులు నష్టపోయినా కేసీఆర్ సర్కార్ ఒక్కరూపాయి సాయం కూడా చేయలేదన్నారు. వరదలతో  నష్టపోయిన రైతు ఎకరాకు లక్ష రూపాయలైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Written by - Srisailam | Last Updated : Jul 25, 2022, 02:30 PM IST
  • కేసీఆర్, కేటీఆర్ పై షర్మిల ఫైర్
  • కాళేశ్వరం ప్రాజెక్టు అబద్దం- షర్మిల
  • మేఘ నుంచి రేవంత్,బండికి వాటాలు- షర్మిల
SHARMILA COMMENTS: సినిమాలు, షోలు చూస్తూ కాలక్షేపం చేస్తారా?కేటీఆర్ కు సిగ్గులేదా?

SHARMILA COMMENTS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. వరదలు వచ్చి రైతులు నష్టపోయినా కేసీఆర్ సర్కార్ ఒక్కరూపాయి సాయం కూడా చేయలేదన్నారు. వరదలతో  నష్టపోయిన రైతు ఎకరాకు లక్ష రూపాయలైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచితంగా విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి భరోసా కల్పించాలన్నారు. వరదలతో ఇల్లులు కోల్పోయిన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు షర్మిల.

కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బ్యాక్ వాటర్ స్టోరేజ్ తో వందల ఎకరాలు నీట మునిగాయని చెప్పారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి టూరిజం ప్రాజెక్టు కట్టారా ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన అబద్దం అన్నారు షర్మిల. రెండేళ్లలోనే మునిగిపోయిందంటే కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. కాళేశ్వరం తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మేఘ కృష్ణారెడ్డి కే ప్రాజెక్టు ఎందుకు ఇచ్చారో కేసీఆర్ కే తెలియాలన్నారు. నాణ్యతలేని పనులు చేసిన కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం కోసం వృధా చేసిన డబ్బుతో రుణమాఫీ , డబుల్ బెడ్ రూమ్, ప్రాణహిత చేవెళ్ల లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చన్నారు.మేఘ కృష్ణారెడ్డికి ఇస్తే కేసీఆర్ కు అందులో వాటా వస్తుందని ఆరోపించారు. తెలంగాణ లో కాంట్రాక్టర్లు లేరా? తెలంగాణ తెచ్చింది మేఘ కృష్ణారెడ్డి కోసమేనా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల.

ఉద్యమ సమయంలో కాంట్రాక్టులన్ని ఆంధ్ర వాళ్లకేనా అని ప్రశ్నించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చేస్తున్నదేంటి? అని నిలదీశారు.  బండి సంజయ్, రేవంత్ రెడ్డి లు మేఘ కృష్ణారెడ్డి మనుషులేనని.. వాళ్లకు కూడా వాటాలు అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే మేఘపై ఎవరు మాట్లాడటం లేదన్నారు. మేఘ కృష్ణారెడ్డి సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. కేటీఆర్ రిమోట్ గా పనిచేయలేరా? సినిమాలు, షో లు చూస్తూ కాలక్షేపం చేస్తారా? అంటూ మండిపడ్డారు. దమ్ముంటే కేటీఆర్ సబ్జెక్టు మాట్లాడాలన్నారు. మహిళానైన తమపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా ? సిగ్గులేదా? అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడెం ప్రాజెక్టు నిర్వహణ లోపంతోనే ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని షర్మిల మండిపడ్డారు. గేట్లు మార్చాలనే డిమాండ్ 3 ఏళ్ల నుంచి ఉన్న కనీసం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే భద్రాచలం ముప్పు వచ్చిందన్నారు.  కరకట్ట ఉండిఉంటే ఈ సమస్య  వచ్చేది కాదన్నారు. విదేశీ కుట్ర అంటూ డ్రామాలు ఆడారు తప్ప ఒక్క బాధితుడినైన పరమర్శించారా? అని షర్మిల మండిపడ్డారు. పోలవరం సమస్య అని ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. ఏపీ సీఎంతో స్వీట్లు తినిపించుకున్నప్పుడు పోలవరం సమస్య గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గుట్ట మీద ఇల్లులు ఎవడు అడిగాడు...స్థానికుల డిమాండ్ మేరకు కరకట్ట నిర్మించాలని షర్మిల డిమాండ్ చేశారు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు 10 వేల సాయం ఎంతమందికి ఇచ్చారో బయటపెట్టాలన్నారు. యాదాద్రిలో  కేసీఆర్ కుటుంబ సభ్యులకు రియలేస్టేట్ ఉంది కాబట్టి అక్కటే అభివృద్ధి చేశారన్నారు.

Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవస

Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News