Weather Alert: తెలంగాణకు రాగల 3 రోజులు వర్ష సూచన... రాయలసీమలో తేలికపాటి వర్షాలు..

Telugu States Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు ఏపీలోని రాయలసీమలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 02:09 PM IST
  • తెలంగాణ, రాయలసీమకు వర్ష సూచన
  • రాగల 3 రోజులు తెలంగాణలో వర్షాలు
  • రాయలసీమలో ఇవాళ్టి నుంచి 3 రోజులు తేలికపాటి వర్షాలు
Weather Alert: తెలంగాణకు రాగల 3 రోజులు వర్ష సూచన... రాయలసీమలో తేలికపాటి వర్షాలు..

Telugu States Weather Report: తెలంగాణకు రాగల 3 రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో రేపు, ఎల్లుండి (ఏప్రిల్ 26,27) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, మరాఠ్వాడల మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టం నుంచి  0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతోనే తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. 

రాయలసీమకు వర్ష సూచన :

ఏపీ, యానాంలలో దిగువ  ట్రోపో ఆవరణంలో  దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ తేలికపాటి  వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల  కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు  సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ నమోదు కావొచ్చు. ఉరుములు, మెరుపులు, వడగాలులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. 

రేపు (ఏప్రిల్ 26) తేలికపాటి  వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల  కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు  సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదు కావొచ్చు. ఒకటి, రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి (ఏప్రిల్ 27) వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.  దక్షిణ కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి (ఏప్రిల్ 26, 27) వాతావరణం పొడిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయి. రాయలసీమలో ఇవాళ తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. 

Also Read: Airtel Jio VI: ఎయిర్‌టెల్, జియో, వీఐ.. ఈ మూడింటిలో ఎక్కువ వాలిడిటీ, ఎక్కువ డేటా పొందే ప్లాన్స్ ఇవే...  

Also Read: World Malaria Day 2022: మలేరియా దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ స్టోరీ..మలేరియా లక్షణాలు, నివారణ చర్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News