Whether Report In Telanga For Another 3 Days: తెలంగాణలో భానుడు భగ భగ మండిపోతున్నాడు. ముఖ్యంగా ఉదయం పదితర్వాత బైటకు వెళ్లాలంటనే భయంతో జనాలు వణికిపోతున్నారు. అత్యవసరంఅయితే తప్ప బైటకు వెళ్లోద్దని నిపుణులు సూచిస్తున్నారు.ఇదిలా ఉండగా.. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు మాత్రం క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఉన్న ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో రానున్న మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని, వాతావరణ కేంద్రం ఒక ప్రటకనలో వెల్లడించింది.
ముఖ్యంగా ఉపరిత ఆవర్తణ ద్రోణి.. మరాఠ్వాడ నుండి కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. నిన్న దక్షిణ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.
Read more: Rajasthan Man Collapses: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని ఘటన.. వీడియో వైరల్..
అదే విధంగా.. నిన్న దక్షిణ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం నుండి విదర్భ, మరాఠ్వాడా మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు బలహీనపడినట్లు సమాచారం.
రాగల 3 రోజుల వాతావరణ సూచన
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈ రోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం కూడా ఉంది.
Read More: Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..
వాతావరణ హెచ్చరికలు
ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో వీచే అవకాశమనున్నట్లు హైదరబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనితోపాటు.. తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజంలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter