ఖమ్మం: ఓవైపు ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మెబాట పట్టి న్యాయ పోరాటం చేస్తోంటే.. మరోవైపు కొంతమంది ఆర్టీసీ సిబ్బంది అధైర్యపడి అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. కారణాలు ఏవైనా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నీరజ అనే ఉద్యోగిని సోమవారం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సహోద్యోగిని సూసైడ్ గురించి తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. నీరజ ఆత్మహత్యకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ వైఖరే కారణమంటూ జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు నిరసనలు చేపట్టారు.
శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యతో నిరసనలు అధికమైన ఖమ్మం జిల్లాలో నీరజ ఆత్మహత్య మరోసారి వారిలో ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలకు కారణమైంది.