TS RTC Sankranti special: ఛార్జీల పెంపు లేకుండానే సంక్రాంతి స్పెషల్ బస్సులు: టీఎస్ ఆర్​టీసీ

TS RTC Sankranti special: సంక్రాతి పండుగ నేపథ్యంలో టీఎస్​​ ఆర్​టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు.. ఏపీలోని పలు జిల్లాలకు భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 12:02 AM IST
  • టీఎస్​ ఆర్​టీసీ సంక్రాతి స్పెషల్ బస్సులు
  • తెలంగాణతో పాటు ఏపీకీ నడపనున్నట్లు వెల్లడి
  • టికెట్ ధరల పెంపు ఉండదని స్పష్టం
TS RTC Sankranti special: ఛార్జీల పెంపు లేకుండానే సంక్రాంతి స్పెషల్ బస్సులు: టీఎస్ ఆర్​టీసీ

TS RTC Sankranti special: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్​ చెప్పింది. పండుగ నేపథ్యంలో ప్రయాణాల కోసం 4,318 స్పెషల్​ బస్సులు (TS RTC Sankranti special buses) అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అయితే ప్రత్యేక బస్సుల్లో సైతం అదనపు ఛార్జీలు ఉండవని (TS RTC Sankranti offer) స్పష్టం చేసింది.

అందుకే ఈ నిర్ణయం..

సంక్రాతి వచ్చిందంటే.. హైదరాబాద్​ నుంచి వేలాది మంది సొంతూళ్లకు వెళ్తుంటారు. దీనితో హైదరాబాద్​లోని బస్టాండ్లు.. ప్రధాన కూడళ్లు జనాలతో కిక్కిరిసిపోతాయి. ఇదే అదనుగా ట్రావెల్​ సంస్థలు రెట్టింపు ధరకు టికెట్లు విక్రయిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. ప్రయాణికులను ఆకర్షించేందుకు భారీగా స్పెషల్ బస్సులతోపాటు.. టికెట్ ధరలను సైతం పెంచకూడాదని తెలంగాణ ఆర్​టీసీ నిర్ణయం (TS RTC Sankranti new Offers) తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్పెషల్​ బస్సులు ఈ నెల 7 నుంచే ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది (TS RTC Sankranti special buses form 7th Jan) టీఎస్​ ఆర్​టీసీ. తెలంగాణతో పాటు ఏపీలో వివిధ జిల్లాలకు సైతం స్పెషల్​ బస్సులు నడుస్తాయని పేర్కొంది.

స్పెషల్ బస్సులు ఎక్కడి నుంచి?

స్పెషల్ బస్సులు హైదరాబాద్​ నుంచి వివిధ జిల్లాలకు నడవనున్నాయి. నగరంలోని ఎంజీబీస్​, జేబీఎస్​ సహా ప్రధాన కూడళ్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

చివరి నిమిషంలో సీటు దొరక్క ఇబ్బంది పడకుండా.. ముందుగానే సీటు బుక్​ చేసుకునే (TS RTC Online Booking Servises) అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్​​ ఆర్​టీసీ వివరించింది. టీఎస్​ ఆర్​టీసీ అధికారిక వెబ్​సైట్లోకి వెళ్లి టికెట్ బుక్​ చేసుకోవచ్చని తేలింపింది.

Also read: Corona in Telangana: తెలంగాణలో కరోనా కోరలు- కొత్తగా 1,913 మందికి పాజిటివ్​

Also read: Vanama Raghava Arrest: హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్.. కొత్తగూడెంకు తరలింపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News