TS Inter Results 2024: ఇంటర్ ఫలితాల్లో 470కి 468 మార్కులు.. బాలిక సరికొత్త రికార్డు

TS Inter Results Toper: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి బాలిక తన ప్రతిభను చాటుకుంది. ఫస్టియర్ ఫలితాల్లో 470 మార్కులకు ఏకంగా 468 మార్కులు సాధించింది. కేవలం రెండు లాంగ్వేజ్‌లలో మాత్రమే ఒక్కొ మార్కు తగ్గగా.. మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లలో ఫుల్ మార్కులు వచ్చాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 24, 2024, 05:29 PM IST
TS Inter Results 2024: ఇంటర్ ఫలితాల్లో 470కి 468 మార్కులు.. బాలిక సరికొత్త రికార్డు

TS Inter Results Toper: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తాచాటారు. ప్రథమ సంవత్సరంలో 60.01 శాతం, ద్వితీయ సంవత్సరంలో 64.18 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 68.35 శాతం, బాలురు 51.05 శాతం మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు 72.53%, బాలురు 56.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో రంగారెడ్డి 71.07 శాతంతో టాప్ ప్లేస్‌లో, సెకండియర్లో ములుగు 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. రేపటి నుంచి మే 2వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇక ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి మార్క్స్ మెమోలు ఆన్‌లైన్‌ అందుబాటులోకి వచ్చాయి. 

Also Read: Oppo A60 Price: శక్తివంతమైన 50MP కెమెరాతో Oppo A60 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!  

ఇంటర్మీడియల్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన వలకొండ చర్విత అత్యధిక మార్కులతో సత్తా చాటింది. ఫస్టియర్ చదువుతున్న ఆమెకు MPC గ్రూపులో 470 మార్కులకు 468 మార్కులు రావడం విశేషం. ఇంగ్లీష్‌లో 99 (థియరీ 79+ప్రాక్టికల్స్‌ 20), సంస్కృతంలో 99, మ్యాథ్స్‌ 1ఏలో 75, మ్యాథ్స్‌ 1బీలో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60 మార్కులు వచ్చాయి. దీంతో చర్వితపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరోవైపు ఏపీ టెన్త్ ఫలితాల్లోనూ మనస్వి అనే విద్యార్థిని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 600 మార్కులకు గాను ఏకంగా 599 సాధించి.. తొలిసారి ఈ మార్కును చేరిన విద్యార్థినిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింవది. సెకెండ్ లాంగ్వేజ్ హిందీలో మాత్రమే ఆ అమ్మాయికి 99 మార్కులు రాగా.. మిగిలిన ఐదు సబ్జెక్ట్స్‌లో 100కి 100 మార్కులు సాధించింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో 468 మార్కులు సాధించిన చర్వితకు కూడా రెండు లాంగ్వేజ్‌లలో మాత్రమే ఒక్కొ మార్కు చొప్పున తగ్గింది. మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లలో అవుటాఫ్ మార్కులు సాధించింది. 

ఇక ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్థాపానికి గురై ఓ విద్యార్థిని బల్వన్మరణానికి పాల్పడ్డ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చోటుచేసుకుంది. ముదిగొండ మండల కేంద్రానికి చెందిన వాకదాని వైశాలి ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. నేడు రిలీజ్ అయిన ఇంటర్  ఫలితాలలో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News