Chandrababu naidu: తప్పులు చేసిన వారిని వదలం.. విజయవాడ సభ నుంచి మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..

Andhra pradesh:  టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు.  విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశంలో..  చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 11, 2024, 01:07 PM IST
  • ఎన్డీఏ శాసనసభాపక్ష ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు..
  • గవర్నర్ దగ్గరకు తీర్మానం పంపిన కూటమినేతలు..
Chandrababu naidu: తప్పులు చేసిన వారిని వదలం.. విజయవాడ సభ నుంచి మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..

Andhra pradesh alliance legislative party meeting in vijayawada: ఆంధ్ర ప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ వేదికగా ఏ కన్వెన్షన్‌లో హల్ లో చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరీ సమావేశ మయ్యారు. అదే విధంగా గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున హజరయ్యారు. ఈ సమావేశంలో.. టీడీపీ చీఫ్ చంద్రబాబును.. ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. తెలుగు దేశం పార్టీ, జననసేన పార్టీ, బీజేపీలు పాల్గొన్న ఈ సమావేశంలో.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు,  పవన్ కళ్యాణ్ లు  చంద్రబాబు పేరును  శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించగా.... మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా లేచీ నిలబడి తమ సంపూర్ణ మద్దతు  తెలియజేశారు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

అదేవిధంగా.. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలంతా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపించారు. ఈ క్రమంలోనే..  గవర్నర్‌ నజీర్ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతారు. ఇదిలా ఉండగా.. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. 

తనపై నమ్మకం ఉంచి, ఎన్డీఏ సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని.. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన గురుతర  బాధ్యత ఎన్డీఏ కూటమిపై ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీ రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం తీసుకుచ్చేందుకు కష్టపడాలన్నారు. ఎన్నికలలో ఓట్లు చీలకుండా, ఎక్కడ భేషజాలకు పోకుండా..  తెలుగు దేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. ప్రజల మనస్సులు గెలుచుకునేలా కార్యకర్తలు పనిచేశారని.. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 

తప్పులు చేసిన వారిని వదలం..

పవన్‌ కళ్యాణ్‌ తనను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చిన పరామర్శించిన ఘటన గుర్తు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారని.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుందన్నారు. ఎలాంటి భేషజాలు  లేకుండాన అందరం కలిసి సమిష్టిగా పనిచేశామన్నారు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి కక్షసాధింపులు లేకుండా.. పాలన అందిస్తామన్నారు. అదేవిధంగా తప్పులు చేసిన వారిని మాత్రం వదిలే ప్రసక్తిలేదని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని (మాజీ సీఎం వైఎస్ జగన్ ను) పరోక్షంగా చంద్రబాబు హెచ్చరించారు.

అమరావతిపై కీలక ప్రకటన..

చంద్రబాబు అమరావతిపై ఆసక్తికర ప ప్రకటన చేశారు. ఇక మీదట ఏపీలో మూడు రాజధానులు ఉండవని.. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని తెల్చి చెప్పారు. విశాఖపట్టణాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీని నాలుగు సీట్లలో గెలిపించారని గుర్తు చేశారు. రాబోయే  రోజుల్లో అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని.. రాష్ట్రంలో మంచిపాలన అందిస్తామన్నారు. ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం... పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతుందని చంద్రబాబు అన్నారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇటీవల ఏపీ ఎన్నికల్లో కూటమి అద్భుత మెజార్టీతో 164 స్థానాలను కూటమి దక్కించుకోవడం,  ఎన్డీఏ కూటమి 21 లోక్‌సభ స్థానాలను దక్కించుకుందని.. కూటమి సాధించిన ఘనవిజయం  దేశం మొత్తానికి ఆదర్శంగా మారిందన్నారు. ఏపీ డెవలప్ మెంట్ కోసం అందరం కష్టపడి పనిచేద్దామని,  కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని హితవు పలికారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

ఐదు కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారని.. అభివృద్ధి చేయడమే టార్గెట్ గా  ముందుకు వెళ్దామని పవన్ కళ్యాన్ ఆకాంక్షించారు.ఇక బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరీ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ పాలనలో.. ఈ ఐదేళ్లలో ఏపీ అన్నిరకాలుగా వెనుక బడిందని, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదర్కొన్నామని,అందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News