Revanth Reddy: బద్ద శత్రువులు ఒక్కటవుతున్నారా! త్వరలో కాంగ్రెస్ గూటికి పట్నం సోదరులు?

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

Written by - Srisailam | Last Updated : Aug 7, 2022, 02:53 PM IST
  • తెలంగాణలో జోరుగా వలసలు
  • త్వరలో కాంగ్రెస్ గూటికి పట్నం
  • పట్నం సోదరులను ఆహ్వానించిన రేవంత్
Revanth Reddy: బద్ద శత్రువులు ఒక్కటవుతున్నారా! త్వరలో కాంగ్రెస్ గూటికి పట్నం సోదరులు?

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈనెల 21న బీజేపీలో చేరనున్నారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. త్వరలోనే 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ పార్టీలో చేరబోతున్నారని తెలంగాణ కమలం నేతలు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ కూడా బీజేపీ ధీటుగా వలసలపై ఫోకస్ చేసింది. కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. తాజాగా అధికార పార్టీకి మరో నేత షాకివ్వబోతున్నారని తెలుస్తోంది.

వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కారు దిగపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. కొంత కాలంగా వికారాబాద్ టీఆర్ఎస్ లో వర్గపోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు కేసీఆర్. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి.. తర్వాత అధికార పార్టీలోచేరారు. రోహిత్ రెడ్డి రాకతో తాండూరు టీఆర్ఎస్ లో వర్గ పోరు మొదలైంది. రోజురోజుకు అది తీవ్రమైంది. రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడమే కాదు ఏకంగా దాడులకు పాల్పడుతున్నాయి. తాండూరు గొడవలపై కేటీఆర్ దగ్గర పలుసార్లు పంచాయతి జరిగినా ఆధిపత్య పోరు మాత్రం ఆగలేదు. ఇటీవల కాలంలో మరింత తీవ్రమైంది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సవాళ్లు విసురుకుంటున్నారు. తాండూరు మున్సిపల్ చైర్మెన్ అంశంలో ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తోంది.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ టికెట్ రోహిత్ రెడ్డికే వస్తుందనే సిగ్నల్ హైకమాండ్ నుంచి వచ్చిందంటున్నారు. దీంతో పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని భావిస్తున్న మహేందర్ రెడ్డి... పార్టీ మారాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఇప్పటికే పలు సార్లు చర్చలు జరిగాయంటున్నారు. మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారని తెలుస్తోంది. త్వరలోనే తాండూరు నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నఅనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మహేందర్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారని పట్నం వర్గీయులు అంటున్నారు.

 పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డిపై ఆయన సంచలన విజయం సాధించారు. పట్నం సోదరులు రేవంత్ రెడ్డి టార్గెట్ గా దూకుడు రాజకీయం చేస్తూ వచ్చారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచే రేవంత్ , మహేందర్ మధ్య  విభేదావు ఉన్నాయంటున్నారు. రేవంత్ రెడ్డితో పొసగకనే పట్నం సోదరులు టీఆర్ఎస్ లో చేరారనే టాక్ ఉంది. టీఆర్ఎస్ లో చేరడమే కాదు సవాల్ చేసి మరీ కొడంగల్ లో రేవంత్ రెడ్డిని మట్టికరిపించారు. తనను ఓడించేందకు పట్నం సోదరులు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వాత శత్రువులు ఉండరని అంటారు. రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు మహేందర్ రెడ్డి సిద్ధమయ్యారని అంటున్నారు. మరోవైపు మహేందర్ రెడ్జి ఒక్కరే పార్టీ మారుతారా లేక ఆయన సోదరుడు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతానికి మహేందర్ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్ లో చేరుతారని... ఎన్నికల సమయానికి అప్పటి పరిస్థితులను బట్టి నరేందర్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరవచ్చేనే ప్రచారం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతోంది.

Also read:Flipkart Offers: శాంసంగ్ రెడీ LED టీవీ మరి ఇంత డెడ్ చీపా..? రూ. 3,990లకే టీవీ.!

 
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News