Mla Pilot Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణ ను నిలిపివేయాలంటూ.. హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు రోహిత్ రెడ్డి.
తాళ్లూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆయన కీలకంగా వ్యవహరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
TRS MLAS BRIBE: తెలంగాణలో వెలుగుచూసిన ఎమ్మెల్యేల బేరసారాల అంశంపై తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. బీజేపీ తీరుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బీజేపీ రెడ్ హ్యాండడ్ గా దొరికిందన్నారు సిసోడియా.
BANDI SANJAY: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధంలేదని బండి సంజయ్.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు. 100 కోట్లు డబ్బు అన్నారు..డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను బయటకు ఎందుకు రానివ్వడం లేదని అన్నారు. ఆధారాలు లేవు కాబట్టి కోర్టు రిమాండ్కు కూడా ఇవ్వలేదని తెలిపారు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీ ప్రతిష్ట దిగదార్చే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునేలా సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని అన్నారు.
KTR COMMENTS:ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించిన హైకోర్టు.. నిందితులను లొంగిపోవాలన ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ పై మరో తీర్పు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది.
RS MLAS BRIBE: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్. సైబరాబాద్ పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రభుత్వ అప్పీల్ ను కోర్టు పరిగణలోనికి తీసుకుంది.
TRS MLAS BRIBE: ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని.. ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపారని చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు.
TRS MLAS BRIBE: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ కేసులో నందకుమార్ డొంక కదులుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నందకుమార్ కు సంబంధించి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.