Telangana: స్థానిక ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్..నేతల్లో ఆందోళన

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలో సమీపించనున్నాయి.త్వరలో పదవీకాలం ముగియడంతో ఎన్నికలపై టీఆర్ఎస్ ( TRS )  అగ్రనాయకత్వం దృష్టి పెట్టగా...స్థానిక నేతల్లో మాత్రం ఆందోళన కలుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

Last Updated : Aug 24, 2020, 05:16 PM IST
Telangana: స్థానిక ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్..నేతల్లో ఆందోళన

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలో సమీపించనున్నాయి.త్వరలో పదవీకాలం ముగియడంతో ఎన్నికలపై టీఆర్ఎస్ ( TRS )  అగ్రనాయకత్వం దృష్టి పెట్టగా...స్థానిక నేతల్లో మాత్రం ఆందోళన కలుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ( Greater Hyderabad ), వరంగల్ ( Warangal ) , ఖమ్మం ( Khammam ) మున్సిపల్ కార్పొరేషన్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపధ్యంలో వెంటనే ఎన్నికలకు వెళ్లి..వాటిని కైవసం చేసుకుని మరోసారి పట్టు సాధించే ప్రయత్నంలో టీఆర్ఎస్ అధిష్ఠానం నిమగ్నమైంది. అయితే ఎన్నికలకు వెళ్లేముందు..కరోనా వైరస్ ( Corona virus ) కట్టడి, భారీ వర్షాల కారణంగా ఎదురైన ముంపు, పార్టీ పటిష్టత అంశాల్ని దృష్టిలో పెట్టుకోవల్సి వస్తుందనేది కొంతమంది వాదనగా ఉంది. అందుకే ఎన్నికలపై నిర్ణయం తీసుకునేముందు సీఎం కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. పార్టీకు అనుకూల పరిస్థితులున్నాయా..ప్రతికూల పరిస్థితులున్నాయా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్ నాయకత్వం. ప్రగతి భవన్ ( pragati bhavan ) లో ఇప్పటికే ఈ విషయమై ఆయా జిల్లాల నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశం ( minister ktr ) కూడా నిర్వహించారు. స్థానిక నేతల మధ్య సమన్వయం, కొన్ని సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంది. ఇటీవల భారీ వర్షాలకు వరంగల్ నగరం ముంపుకు గురవడం, వెంటనే మంత్రి కేటీఆర్ రంగంలో దిగి..సహాయక చర్యల్ని పర్యవేక్షించడం తెలిసిందే. అటు హైదరాబాద్ విషయంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. Also read: Srisailam fire accident: సీబీఐ విచారణ కోరుతూ మోదీకు లేఖ రాసిన రేవంత్ రెడ్డి

Trending News