Hyderabad Traffic: భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు..!

Hyderabad Traffic: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. రోప్ పేరుతో వీటిని అమలు చేస్తున్నారు. ఇటు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. 

Written by - Alla Swamy | Last Updated : Oct 3, 2022, 05:05 PM IST
  • హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు
  • రోప్ పేరుతో అమలు
  • పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు
Hyderabad Traffic: భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు..!

Hyderabad Traffic: తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. వాడవాడలా పూలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుక ఉండనుంది. దీంతో ఇవాళ్టి మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి.

ఈమేరకు ట్రాఫిక్ పోలీసులు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆంక్షల సమయంలో నిజాం కాలేజ్, బషీర్ బాగ్ కూడలి, కంట్రోల్ రూమ్, ఆర్బీఐ, లక్డీకపూల్, అంబేద్కర్ విగ్రహం, తెలుగు తల్లి కూడళ్ల వైపు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో వేడుకలకు వచ్చే వారి వాహనాల కోసం పలు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియం టెన్నిస్ మైదానం వద్ద వీఐపీలు అధికారులకు కేటాయించారు. 

మీడియా వాహనాలకు ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయం వద్ద కేటాయించామని పోలీసులు తెలిపారు. మహిళలను తీసుకొచ్చే వాహనాలను బుద్ధ భవన్‌ వెనుక పార్క్‌ చేయాలని సూచించారు. ఇటు నిజాం స్టేడియంలోనూ పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. లెటెస్ట్ అప్‌డేట్స్‌ కోసం హైదరాబాద్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను చూడాలని వెల్లడించారు. 

ఇటు నగరవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఆచరణలోకి వచ్చాయి. గీత దాటితే భారీ రుసుమును వేయనున్నారు. ఇవాళ్టి నుంచి రూల్స్ అమలులోకి వచ్చాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాడితే రుసుము వేస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కల్గిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. పాదచారులకు ఆటంకం కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 వసూలు చేయనున్నారు. ఈమేరకు ఇది వరకే ప్రకటన విడుదల చేశారు. 

Also read:Fishermen: తమిళనాడు మత్స్యకారుల వలకు చిక్కిన అంబర్ గ్రిస్..ధర తెలుస్తే షాకే..!

Also read:CM Kcr: ఈనెల 5న గులాబీ షో..ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News