TS Assembly Elections: రూ.4 వేల పెన్షన్ ఇస్తాం.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి ప్రకటన

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదింకుందని అన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 22, 2023, 04:54 PM IST
TS Assembly Elections: రూ.4 వేల పెన్షన్ ఇస్తాం.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి ప్రకటన

Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని.. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. మంగళవారం చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లికి చెందిన పీఏసీఎస్  డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్, బీజేపీ మాజీ జెడ్పీటీసీ రవీందర్, పలువురు మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న కేసీఆర్.. పేదల సంక్షేమాన్ని మరిచారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు అని ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించని పరిస్థితి వచ్చింది. వరి వేస్తే ఉరే అని చెప్పిన రైతు వ్యతిరేకి కేసీఆర్ సీఎం అయ్యాక 88 వేల మంది రైతులు చనిపోయారు.
దళితులకు భూములు పంచింది.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే.. రాష్ట్ర సంపదను కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారు.." అని ఆరోపించారు. 

గత తొమ్మిదేళ్లలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ చుట్టూ  10 వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని.. ప్రశ్నించిన వారిపైకి పోలీసులను పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.  500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు.  

మీర్‌పేట్ బాలిక అత్యాచార ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. నిన్న సింగరేణి కాలనీలో.. నేడు మీర్‌పేటలో ఆడబిడ్డలపై అఘాయిత్యాల కలచివేస్తున్నాయని అన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని.. ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలనపై  “తిరగబడదాం-తరిమికొడదాం” అని పిలుపునిచ్చారు.

Also Read: Minister Harish Rao: అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ మొదటి సభ.. మెదక్‌లో ప్రగతి శంఖారావం: మంత్రి హరీశ్ రావు  

Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News