COVID-19 : కరోనావైరస్ లేటెస్ట్ అప్‌డేట్స్

తెలంగాణలో శుక్రవారం కొత్తగా 100 కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల మధ్య జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 100 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.

Last Updated : May 30, 2020, 04:00 AM IST
COVID-19 : కరోనావైరస్ లేటెస్ట్ అప్‌డేట్స్

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 100 కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల మధ్య జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 100 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 82 ఉండగా రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు బయటపడ్డాయి. వీరిలో ఐదుగురు మైగ్రంట్స్ కాగా 64 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్.. లాక్‌డౌన్‌ కొనసాగింపుపైనే చర్చ )

కరోనా కారణంగా ఇవాళ నలుగురు చనిపోయారు. ఆ నలుగురూ కూడా 53 ఏళ్ల నుంచి 62 ఏళ్ల మధ్య వయస్సు వారే కావడంతో పాటు ఏదో ఒక ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారే కావడం గమనార్హం. దీంతో  ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 71కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1381 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం తెలంగాణలో 973 యాక్టివ్  కేసులున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News