Minister KTR: చేనేతపై జీఎస్టీ అంటే నేతన్నకు మరణ శాసనమే..పునరాలోచించాలన్న మంత్రి కేటీఆర్..!

Minister KTR: చేనేత రంగంపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతోంది. తాజాగా మరోమారు కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 7, 2022, 07:42 PM IST
  • పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన
  • ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్‌.రమణ
  • పాల్గొన్న కేటీఆర్
Minister KTR: చేనేతపై జీఎస్టీ అంటే నేతన్నకు మరణ శాసనమే..పునరాలోచించాలన్న మంత్రి కేటీఆర్..!

Minister KTR: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలన్నారు మంత్రి కేటీఆర్. చేనేతపై జీఎస్టీ విధించడమంటే చేనేత పరిశ్రమకు మరణ శాసనం రాసినట్లేనని మండిపడ్డారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ ప్రారంభించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం హాజరయ్యారు.  

ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం శుభపరిణామన్నారు. చేనేత మిత్ర ద్వారా 50 శాతం సబ్సిడీతో ముడి సరకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. నేతన్న బీమా ద్వారా 8 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు నేతన్న మరణిస్తే పది రోజుల్లో రూ.5 లక్షల బీమా అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా వారికి లబ్ధి చేకూరుతుందన్నారు.

ప్రతి ఒకరు చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చేనేత కార్మికుల సమస్యలను వివరిస్తూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని..తక్షణమే చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిర్ణయాల వల్ల చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు వీటిపై దృష్టి పెట్టాలన్నారు. 

తెలంగాణ టెక్స్‌టైల్స్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్రం ఎలాంటి సాయం చేయడం లేదని విమర్శించారు మంత్రి కేటీఆర్. దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్స్ పార్క్ కాకతీయకు ఎలాంటి సహాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ కస్టర్ ఏర్పాటు ఏమయ్యిందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్‌ టైల్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తోపాటు హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్‌ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

Also read:Minister Harish Rao: తెలంగాణపై వివక్ష దేనికీ..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు ధ్వజం..!

Also read:AP Rain Alert: ఏపీకి తరుముకొస్తున్న వాయు'గండం'..ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News