CM Kcr: త్వరలో సీఎం కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు సీఎంవో అధికారికంగా ప్రకటించింది. ఈనెల 29న పెద్దపల్లి జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్ 10న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నూతన కలెక్టరేట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నాయి. త్వరలో మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ టూర్ నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లిలో సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పరిశీలించారు.
లక్ష మందితో సభను నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తి అవుతున్నాయన్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ఉంటుందని మంత్రులు చెప్పారు. సభకు సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంత్రుల వెంట స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఇతర నేతలు, అధికారులు ఉన్నారు.
ఈనెల 25న రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారంలోపు ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Also read:Amit Shah: రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారం..మునుగోడు సభలో అమిత్ షా..!
Also read:Pawan Kalyan: ఏ పార్టీకి కొమ్ముకాయం..ప్రత్యామ్నాయంగా ఉంటామన్న పవన్ కళ్యాణ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి