CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్..నితీష్‌ కుమార్‌తో కీలక మంతనాలు..!

CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఆయన..తాజాగా బీహార్‌లో పర్యటించారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 31, 2022, 05:12 PM IST
  • స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్
  • జాతీయ రాజకీయాలపై ఫోకస్
  • బీహార్‌లో పర్యటన
CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్..నితీష్‌ కుమార్‌తో కీలక మంతనాలు..!

CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూసుకెళ్తున్నారు. తాజాగా బీహార్‌లో అక్కడి సీఎం నితీష్‌కుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. లెటెస్ట్ రాజకీయ పరిణామాలపై చర్చించారు. జాతీయ రాజకీయాల్లో పరిస్థితులు, భవిష్యత్ కార్యచరణపై మంతనాలు జరిపారు. భేటీలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సైతం పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈమేరకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు.

ఢిల్లీ, బెంగళూరులో కీలక నేతలతో చర్చించారు. జాతీయ రాజకీయాల్లో రావాలని ఆయన యోచిస్తున్నారు. పార్టీ సైతం ఏర్పాటు చేయబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు కూడా ఖరారు అయినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఐతే సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా మలి విడత టూర్‌కు శ్రీకారం చుట్టారు. బీహార్‌ పర్యటనకు వెళ్లిన ఆయన మొదటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

గల్వాన్ ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కూలీల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమర జవాన్ల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివని..వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ప్రతి భారతీయుడు వారికి అండగా ఉంటాడని తెలిపారు. 

అనంతరం బీహార్ సీఎం నితీష్‌కుమార్ మాట్లాడారు. అమర జవాన్లు, బీహార్ వలస కూలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఆదుకోవాలనే ఆలోచన చాలా గొప్పదన్నారు. కరోనా సమయంలోనూ వలస కార్మికులను ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ చూపిన చొరవను అభినందించారు. తెలంగాణ ఏర్పాటు కోసం 2001 నుంచి కేసీఆర్ పోరాడుతున్నారని..కృషి, పట్టుదల వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు.

ఉద్యమ నాయకుడే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు సీఎం నితీష్‌కుమార్. 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్బుత పథకాలు తీసుకొచ్చారన్నారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్ అని అన్నారు.  మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు అందించారన్నారని..నదుల నీళ్లను సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. అదే ఫార్ములాను బీహార్‌లో అనుసరిస్తున్నామన్నారు. ఇందు కోసం తెలంగాణకు బీహార్ అధికారులకు పంపుతామన్నారు. అంతకుముందు బీహార్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు బీహార్ సీఎం నితిష్‌కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఘన స్వాగతం పలికారు. 

Also read:24 Crafts of Movies: సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ ఏమేమిటో తెలుసా?

Also read:ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల..అత్యుత్తమ స్థానానికి చేరిన హార్దిక్ పాండ్యా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News