CM Kcr: దేశాన్ని విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయి..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!

CM Kcr: మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 17, 2022, 06:49 PM IST
  • మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం
  • ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు
CM Kcr: దేశాన్ని విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయి..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!

CM Kcr: దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో జరిగే పరిణామాలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు. కొందరు మూర్కులు తెలివి తక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మతం, కులం పేరుపై దేశాన్ని విడగొట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కులం, మతం లేని భారతం మనకు కావాలని పిలుపునిచ్చారు. చైనా, సింగపూర్, కొరియాలాగా కుల, మత రహితంగా పురోగమించాలన్నారు. 

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాలని చెప్పారు. తాను ఎవర్నీ ఉద్దేశించి మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ తరహాలో ఢిల్లీ, మహారాష్ట్రలో నీళ్లు, కరెంట్ ఎందుకు లభించడం లేదని ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాలన్నారు. మోసపోతే మళ్లీ గోసపడతామన్నారు. 58 ఏళ్లు మనం మోసపోయామని..గోస పడ్డామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. విచ్చన్నం చేసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. 

తెలంగాణ ఆస్తులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అవినీతిరహితంగా, క్రమశిక్షణతోకూడిన పాలన సాగిస్తున్నాం కాబట్టే తలసరి ఆదాయంలో తొలిస్థానంలో ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. మేడ్చల్ జిల్లా ఏర్పాటు అవుతుందని అనుకోలేదని..తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే ఇది సాధ్యమయ్యిందన్నారు. 46 లక్షల మందికి పెన్షన్, 24 గంటల కరెంట్ ఇవ్వగలుతున్నామని వెల్లడించారు. 

75 ఏళ్లుగా దేశంలో చేతగాని పరిపాలన వల్ల ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. హైదరాబాద్‌లో కరెంట్ పోదు..దేశ రాజధాని ఢిల్లీలో పోతుందని గుర్తు చేశారు. మేడ్చల్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. ఇప్పుడు ఇస్తున్న దాని కంటే అదనంగా రూ.10 కోట్లు ఇస్తామన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన ఆయన..నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మించారు. 

నూతన కలెక్టరేట్ భవనంలో అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇందులో విశాలమైన 55 గదులను నిర్మించారు. వీటితోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఏవో, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక గదులను కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్‌లో 250 మంది కూర్చునేలా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోనే హెలిప్యాడ్‌ నిర్మించారు. 

Also read:IND vs ZIM: రేపటి నుంచే భారత్, జింబాబ్వే మధ్య వన్డే సిరీస్..టీమిండియా ఓపెనర్ అతడే..!

Also read:Union Govt: రైతన్నలకు గుడ్‌న్యూస్..రుణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News