Telangana Corona Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం ప్రస్తుతం తగ్గుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో తాజాగా 5,892 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 76,047 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 5 వేల 8 వందల 92 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 81 వేల 6 వందల 40కు చేరింది. కరోనా వైరస్(CoronaVirus) తో పోరాడుతూ రాష్ట్రంలో మరో 52 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,625కి చేరింది.
Also Read: AP, Telangana నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా, 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో GHMC పరిధిలోనే 1,104 కేసులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో ప్రస్తుతం 73 వేల 851 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.34 కోట్ల శాంపిల్స్‌కు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు నేటి ఉదయం హెల్త్ బులెటిన్‌లో వైద్యశాఖ వెల్లడించింది తెలంగాణలో చికిత్స అనంతరం నిన్న ఒక్కరోజు కోవిడ్-19 బారి నుంచి 9,122 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 4,05,164 మంది కరోనా మహమ్మారిని జయించారు. రాష్ట్రంలో కరోనా(COVID-19) బారి నుంచి కోలుకుంటున్న వారు 84.12 శాతం ఉన్నారు. జాతీయ సగటు 81.9 శాతంతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉంది.
Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ స్కీమ్ రూ.2000 త్వరలో ఖాతాల్లోకి
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్రం నుంచి అందుతున్న కరోనా డోసులను రిజిస్ట్రేషన్ వివరాలు కనుక్కుని వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే వారికి ఇస్తున్నారు. కోవిడ్19 టీకా మోతాదుల కొరత కారణంగా 18 ఏళ్లు పైబడిన వారి నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకాలు కేవలం కొన్ని కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.54 శాతం ఉండగా, జాతీయ సగటు 1.1 శాతంగా ఉంది.
Also Read: RT-PCR Tests: ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు వీరికి చేయకూడదు, ICMR తాజా మార్గదర్శకాలు విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook