Telangana Political News In Telugu: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప ర్యటన బిజీ బిజీగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో సుదీర్ఘ మంతనాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకం, తర్వాత మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. పిసిసి చీఫ్ గా రేవంత్ వారసుడు ఎవరనేది కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీ నేతకే పిసిసి అధ్యక్షుడి పదవి వరించనుందని అటు ఢిల్లీలో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది.
ముఖ్యంగా మహేశ్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్ ల మధ్య నే ప్రధాన పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది.ఇద్దరూ కూడా ఒకే సామాజికవర్గంకు చెందిన వారు కావడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మహేశ్ కమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతుంది. మహేశ్ కుమార్ గౌడ్ కే పిసిసి చీఫ్ దక్క అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు మరో సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ కూడా పిసిసి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.
స్వతహాగా రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన మధు యాష్కీ గౌడ్ తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పార్టీ పదవుల విషయంలో రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తుల వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేవంత్ సారథ్యంలో ప్రభుత్వం నడుస్తున్నందున అతనికి సంబంధించిన వ్యక్తుల చేతిలోనే పార్టీ ఉంటే కరెక్ట్ అనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉండకూడదు అనుకుంటే రేవంత్ మనుషులకే పిసిసి దక్కవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి నియామకంపై అధిష్టానంఒక నిర్ణయానికి వచ్చింది. రేపో, మాపో అధికారంగా ప్రకటించవచ్చనేది ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతుంది.
మరోవైపు మంత్రి పదవుల విషయంలో కూడా అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బీసీకీ పిసిసి చీఫ్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో మంత్రి వర్గంలో ఒక ఎస్టీకీ అవకాశం కల్పించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం పిసిసి చీఫ్ పదవి అయితే బీసీ లేకుంటే ఎస్టీకీ ఇవ్వాలని అధిష్టానం భావించింది. ఇప్పుడు బీసీకీ ఫైనల్ కావడంతో ఎస్టీకీ మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉండొచ్చనేది ఢిల్లీలో టాక్ నడుస్తుంది. దీనిలో భాగంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు మంత్రి పదవి దక్కవచ్చంటున్నారు. అదే జరిగితే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో మంత్రి పదవి లభించినట్లు అవుతుంది.అయితే ఇదే జిల్లా మంత్రి పదవిపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. నాకు త్వరలో మంత్రి పదవి దక్కుతుందని చాలా సందర్భాల్లో బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బాలు నాయక్ కు ఇస్తే ఇక రాజగోపాల్ రెడ్డికి అవకాశాలు అంతంత మాత్రమే. అదే జరిగితే రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు..అనేది చూడాలి.
ఇక ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజ్ కు మంత్రి పదవి ఇస్తామని రేవంత్ ప్రకటించారు. ఒక ముదిరాజ్ కు కూడా మంత్రివర్గంలో స్థానం ఖాయంగా తెలుస్తుంది. ఈ కోటాలో భాగంగా నీలం మధు, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఇక మిగిలిన వాటిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది నేతలు లెక్కల కడుతున్నారు. సామాజికవర్గం, జిల్లాల వారిగా సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చనేది తెలుస్తుంది. ఇప్పటికే మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు లేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. దీనిపై అధిష్టానం, రేవంత్ ఏం చేయబోతారనేది కూడా ఆసక్తిగా మారింది.
కొత్తగా ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అలాంటి వారికి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇక ఇప్పటికే మంత్రివర్గంలో నిజామాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదని తెలుస్తుంది. దానిలో భాగంగా ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి , సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. ఇక మిగితా స్థానాలపై కూడా కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. రానున్న వారం రోజుల్లోపే దీనికి సంబంధించిన స్పష్టత వస్తుందనేది గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Telangana Political News: నేతల "చేయి"రాత మారేనా.. పదవులు వచ్చెనా?