Minister Ktr: వివక్షతోనే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించలేదు..మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ..!

Minister Ktr: టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా మరో అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 2, 2022, 05:24 PM IST
  • టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
  • మన్‌సుఖ్‌ మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ
  • వివక్ష చూపడంపై ఆగ్రహం
Minister Ktr: వివక్షతోనే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించలేదు..మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ..!

Minister Ktr: బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు ప్రధాని మోదీ మొండి చేయి చూపారన్నారు మంత్రి కేటీఆర్. దీనిపై కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
ఈసందర్బంగా పలు ప్రశ్నలను సంధించారు. తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. బల్క్ డ్రగ్స్ పార్క్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌లోని ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని లేఖలో పేర్కొన్నారు.

భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉన్నా ఫార్మాసిటీని కావాలనే కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. మారుతున్న పరిణామాలతో బల్క్ డ్రగ్స్ పార్క్‌ ఏర్పాటు అత్యవసరమని కేంద్రం ఇటీవల చెప్పిందని..ఐనా మరో నాలుగేళ్లలయినా పట్టలెక్కని ప్రాంతాలకు వాటిని కేటాయించారని లేఖలో వివరించారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసంగా మూడేళ్ల సమయం పడుతుందన్నారు మంత్రి కేటీఆర్.

అన్ని సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ఫార్మా రంగాన్ని ఆత్మ నిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి ఇది నిదర్శమని విమర్శించారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించకపోవడం ముమ్మాటికీ వివక్షేనని లేఖలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తక్షణమే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతోందని లేఖలో ఆరోపించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు దక్కకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. కావాలనే హైదరాబాద్ సిటీని విస్మరించారని ఫైర్ అయ్యారు. బల్స్ డ్రగ్ ఏర్పాటుకు ఏపీ, హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం వెనుక కారణాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీని కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు మంత్రి కేటీఆర్. 

బల్స్ డ్రగ్ పార్క్‌ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో 200 ఎకరాల్లో పార్క్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి ఇప్పటికే చెప్పామని..ఐనా నిర్లక్ష్యం వహించారని మన్‌సుఖ్‌ మాండవీయకు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. దీనిపై ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిశామని గుర్తు చేశారు. ఐనా పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటన్నారు.

Also read:మెగాస్టార్ చిరంజీవిది ఐరెన్ లెగ్గా.. దారుణంగా ట్రోలింగ్!

Also read:Asia Cup 2022: ఖాళీ సమయంలో తెగ ఎంజాయ్‌ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News