Telangana సీఎం కేసీఆర్ కారణజన్ములు, KCRకు బర్త్‌డే విషెస్ తెలిపిన Harish Rao

Harish Rao Wishes CM KCR On His Birthday: జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 17, 2021, 10:05 AM IST
  • నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు
  • పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు
  • మేనమామ కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు
Telangana సీఎం కేసీఆర్ కారణజన్ములు, KCRకు బర్త్‌డే విషెస్ తెలిపిన Harish Rao

Harish Rao Wishes CM KCR On His Birthday:  నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు తన రాజకీయ గురువు, మేనమామ కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్ కారణజన్ములు అని, ఆయన జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని హరీష్ రావు పేర్కొన్నారు. ‘మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్(Happy Birthday CM KCR) గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

Also Read: Ys Sharmila Party: వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ ఎప్పుడంటే

‘దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకు పోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నదని’ మంత్రి హరీష్ రావు(Harish Rao) తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Telangana సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన Revanth Reddy, లేఖలో పలు డిమాండ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News