CM Revanth Reddy: ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు.. కొడంగల్ సభలో మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి..

Kodangal: కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారని అన్నారు. 

Last Updated : Feb 21, 2024, 09:08 PM IST
  • - సీఎం అయ్యాక తొలిసారి కొడంగల్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..
    - బీఆర్ఎస్ నేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు..
CM Revanth Reddy: ప్రజలు ఛీకొట్టినా  కేసీఆర్ కు సిగ్గు రాలేదు.. కొడంగల్ సభలో మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి..

Kosgi Public Meeting CM Revanth Fires On KCR: ప్రజలు ఛీకొట్టినా  కేసీఆర్ కు సిగ్గు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆయన సొంత నియోజక వర్గం కొడంగ్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సభా వేదిక నుంచి కేసీఆర్ ను అడుగుతున్నా.. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు పాలమూరుకు చేసిందేంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

Read More: Kaya Thapar: హాట్ ఫోజులతో కిరాక్ పుట్టిస్తోన్న కావ్య థాపర్.. ఇది మాములు డోసు కాదండోయ్..

ఈ జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని కేసీఆర్ కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. అయ్యా కొడుకులు ఏం మొహం పెట్టుకుని పాలమూరు జిల్లాకు వస్తారని ఎద్దేవా చేశారు. పాలమూరును ఎండబెట్టి.. కొడంగల్ ను పడావు పెట్టి ఎడారి చేశారన్నారు.  70 ఏండ్ల మన గోస తీరుస్తానని మొన్నటి ఎన్నికల్లో మాట ఇచ్చా... ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నాని సీఎం అన్నారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2014లో నేను మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు.  

కానీ కేసీఆర్ ప్రభుత్వం కావాలని.. నారాయణపేట్-కొడంగల్ పథకాన్ని పదేండ్లు పడావు పెట్టిందన్నారు. కొమ్మోడి వెంబడి సన్నాయివాడు పడినట్లు బీజేపీ వైఖరి ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీవి చీకటి ఒప్పందాలు చేస్తున్నాయన్నారు.  బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డిలను ప్రశ్నిస్తు.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 
 

2014లో మోడీ ఇచ్చారు కదా.. పదేండ్లుగా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో డీకే అరుణ, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్  అన్నారు.  కృష్ణా రైల్వే లైన్  ఎందుకు ముందుకు సాగలేదని నేను అడుగుతున్నా.. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా... నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి నాలుగు రూపాయలైన తెచ్చారా..?.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 

పాలమూరు జిల్లాలో ప్రజలను ఓట్లు వేయాలని ఎలా అడుగుతారని, కృష్ణా జలాలు కొడంగల్ రైతులకు అందించే పని మా ప్రభుత్వం చేస్తోందన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రజలను కోరారు. మళ్లీ 5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు.  కాంగ్రెస్ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నా.. ఇదివిరామం మాత్రమే.. ఇంకా యుద్ధం ముగిసిపోలేదన్నారు.

Read More: Yashika Aannand: ఎద అందాలతో వల వేస్తున్న యాషిక ఆనంద్ .. హాట్ ఫిక్స్ వైరల్

17లో 14 పార్లమెంటు స్థానాలు గెలిచినపుడే.. పార్లమెంట్ లో మనం పట్టు సాధించినపుడే యుద్ధం గెలిచినట్టని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న బీఆరెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి. వచ్చే వారం రోజుల్లోనే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామన్నారు.  

200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామన్నారు. వచ్చే నెల 16లోగా అందరికీ రైతు భరోసా,  రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించాలని, సీఎం రేవంత్ కొడంగల్ ప్రజలను కోరారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News