TS Secretariat: కూల్చివేతపై మళ్లీ నిరాశే

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి (Telangana Govt) మళ్లీ నిరాశ తప్పలేదు. భవనాల కూల్చివేతపై ఇంతకుముందు విధించిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు (Telangana High court) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Last Updated : Jul 15, 2020, 04:33 PM IST
TS Secretariat: కూల్చివేతపై మళ్లీ నిరాశే

Telangana: హైదరాబాద్:  తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి ( Telangana Govt ) మళ్లీ నిరాశ తప్పలేదు. భవనాల కూల్చివేతపై ఇంతకుముందు విధించిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు ( Telangana High court ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ భవనాల కూల్చివేత ( Secretariat demolition ) ను నిలిపివేయాలని విశ్వేశ్వరరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  కాగా దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారించి.. రెండు రోజులు స్టే విధించి పలు పత్రాలను సమర్పించాలని ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. దీంతో సచివాలయ కూల్చివేతకు సంబంధించిన మంత్రివర్గ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ధర్మాసనానికి సమర్పించింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టి పలు ఆధార పత్రాలను సమర్పించాలంటూ రేపటి వరకు స్టేను పొడిగించింది. Also read: Telangana: కరోనాకు ఉచిత చికిత్స, ఫ్రీగా కోవిడ్ టెస్టులు

ఈ సందర్భంగా పిటిషనర్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. భవనాల కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని, దానికి విరుద్దంగా పనులు చేపడుతున్నారంటూ ధర్మాసనానికి వివరించారు. దీనిపై ఏజీ స్పందిస్తూ.. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని, నిర్మాణానికి పర్యావరణ అనుమతి కావాలని పేర్కొన్నారు. కూల్చివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకున్నామని వివరించారు. అయితే ఈ వాదనలపై అడిషనల్ నివేదికలు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం సూచించగా.. పర్యావరణ అనుమతులకు సంబంధించి పలు తీర్పులను సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. Also read: Telangana: ఆ తర్వాతే ఖాళీల భర్తీ: KTR

Trending News