Revanth Reddy: తెలంగాణ సచివాలయ కూల్చివేతను ( Secretariat Demolition ) వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ( National Green Tribunal ) విచారణ చేపట్టింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( KCR ) పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయ కూల్చివేత (secretariat demolition) విషయంలో సీఎం కేసీఆర్ తన రహస్య ఎజెండాను అమలు చేశారని పలు అనుమానాలను తెరపైకి తెచ్చారు.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి (Telangana Govt) మళ్లీ నిరాశ తప్పలేదు. భవనాల కూల్చివేతపై ఇంతకుముందు విధించిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు (Telangana High court) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈనెల 13వ తేదీ వరకు భవనాల కూల్చివేతను ఆపాలన్న స్టేను మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఓ చరిత్ర ముగుస్తోంది. తెలంగాణ ( Telangana) గడ్డపై నిజాం ( Nizams) నవాబుల కట్టడం నేలకొరిగింది. శతాబ్దానికి పైగా పాలనలో సేవలందించించిన ఆ భవన సముదాయం ఇకపై కన్పించదు. కొత్త రాష్ట్రానికి కొత్త సచివాలయం ( New Secretariat ) నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించి..కూల్చివేతను ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.