Mission Bhagiratha Scheme: మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు

Mission Bhagiratha Scheme Wins Central govt Award: తెలంగాణలో ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి మరోసారి అవార్డు వరించింది. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర నుండి బూస్టింగ్ లభించడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలోనూ మిషన్ భగీరథ పథకంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రశంసల జల్లు కురిపించారు. 

Written by - Pavan | Last Updated : Sep 29, 2022, 02:21 AM IST
  • ఇంటింటికి స్వఛ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ
  • కేంద్ర అవార్జుకు ఎంపికైన మిషన్ భగీరథ పథకం
  • అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో అవార్జు ప్రధానం
Mission Bhagiratha Scheme: మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు

Mission Bhagiratha Scheme Wins Central govt Award: తెలంగాణలో ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి మరోసారి అవార్డు వరించింది. సీఎం కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాల్లో మిషన్ భగీరథ పథకం కూడా ఒకటి. తెలంగాణలోని మారుమూల పల్లెలు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం అని లేకుండా అన్ని గ్రామాలకు ఇంటింటికి రక్షిత తాగు నీరు సరఫరా అందించే లక్ష్యంతో పనిచేస్తోన్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర నుండి బూస్టింగ్ లభించడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలోనూ మిషన్ భగీరథ పథకంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే జల్ జీవన్ మిషన్ సైతం మిషన్ భగీరథ పథకం భేషుగ్గా ఉందంటూ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. 
 
మిషన్ భగీరథ పథకం అమలు చేస్తున్న తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వంలోని జల్ జీవన్ మిషన్ విభాగం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించి క్షేత్ర స్థాయిలో పథకం అమలవుతున్న తీరును అడిగి తెలుసుకుంది. మిషన్ భగీరథ పథకం కింద సరఫరా అవుతున్న తాగు నీటిలో నాణ్యత, సరఫరా తీరును సమీక్షిస్తూనే గ్రామీణ స్థాయిలో ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మిషన్ భగీరథ పథకం పని తీరు, నిర్వహణ, నీటి నాణ్యత వంటి అంశాలను పరిశీలించి అందించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఈ పథకాన్ని జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలిసింది. 

తాగు నీటి రంగంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, వాటి పని తీరు, నిర్వహణ అంశాలని బేరీజు వేసుకున్న తర్వాతే కేంద్రం తెలంగాణ నుండి మిషన్ భగీరథ పథకంను ఎంపిక చేసిందని సమాచారం. అక్టోబరు 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నాడు ఢిల్లీలో కేంద్రం చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డు అందుకోనుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం కూడా అందింది. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని గుర్తించి, మరోసారి జాతీయ స్థాయిలో మిషన్ భగీరథ పథకాన్ని (Mission Bhagiratha Scheme) కేంద్రం అవార్డుకు ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read : TRS MLA: నయీమొద్దీన్ ఫ్రెండ్.. దావూద్ ఇబ్రహీం కంటే డేంజర్! టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు..

Also Read : KCR NEW PARTY: కేసీఆర్ కొత్త పార్టీ రెడీ.. దసరాకి రిలీజ్? గులాబీ పార్టీలో సంబురం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News