ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆర్మ్‌డ్ ఫోర్స్

                                        

Last Updated : Aug 9, 2018, 12:02 PM IST
ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆర్మ్‌డ్ ఫోర్స్

హైదరాబాద్: డ్రంగ్ అండ్ డ్రైవ్ నేరంగా పరిగణించి కేసు నమోదు చేస్తున్న తరణంలో కొందరు పోలీసులకు సహకరించకపోగా వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. కవర్ చేస్తున్న మీడియాపై దాడులు చేస్తున్న ఘటనలు తరచూ చూస్తునే ఉన్నాం. అయితే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని తనిఖీల్లో సాధారణ పోలీసులతో పాటు ఆర్మ్‌డ్ ఫోర్స్ కూడా ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వయం తీసుకుంది.

వాహనాలు నడిపే మందుబాబులను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఆర్మ్‌డ్ పోర్స్ సహాయం తీసుకోవాలని నిర్ణయంచినట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఏడాది అర్థభాగంలో మొత్తం 7,791 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి  1379 మందిని జైలుకు పంపించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే దాదాపు రూ.85 లక్షల వరకు జరిమానా వసూలు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
 

Trending News