ఎన్నికల రోజు సెలవు ఇవ్వకపోతే.. ఇక అంతే సంగతి!

ఎన్నికల రోజు సెలవు ఇవ్వకపోతే.. ఇక అంతే సంగతి!

Last Updated : Dec 2, 2018, 02:06 PM IST
ఎన్నికల రోజు సెలవు ఇవ్వకపోతే.. ఇక అంతే సంగతి!

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 7వ తేదీన శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థలకు ఆరోజును సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ తెలిపారు. డిసెంబర్‌ 7న సెలవుదినంగా పాటించాలని గతంలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేసినప్పటికీ.. తమకు ఆఫీసులో సెలవు ఇవ్వడంలేదని పలు ప్రైవేట్‌ సంస్థలు, ఐటీ కంపెనీల ఉద్యోగుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని చెబుతూ ఈ సెలవును ప్రకటించని సంస్థలపై ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్‌ 135(బీ)తోపాటు కార్మిక చట్టాల ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ఐటీ సంస్థలతోపాటు ఇతర ప్రైవేటు సంస్థల యాజమాన్యాలను హెచ్చరించారు. 

డిసెంబర్ 7న అన్ని ప్రైవేట్‌ కంపెనీలు, సంస్థలు సెలవు దినంగా పాటించే విధంగా పర్యవేక్షించి సమీక్ష జరపాలని కార్మికశాఖను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించినట్లు ఆయన గుర్తుచేశారు. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో దాన కిషోర్ చేసిన ఈ ప్రకటనతో ఇక తాము తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 

Trending News