Telangana: కలకలం సృష్టిస్తోన్న మావోయిస్టుల లేఖ..

తెలంగాణ ప్రభుత్వం 15 నుండి 20 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకి డబ్బులు ఇస్తూ మధ్యతరగతి కుటుంబాలకు పట్టా లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కన్నాయిగూడెం 

Last Updated : Jun 4, 2020, 09:08 PM IST
Telangana: కలకలం సృష్టిస్తోన్న మావోయిస్టుల లేఖ..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 15 నుండి 20 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకి డబ్బులు ఇస్తూ మధ్యతరగతి కుటుంబాలకు పట్టా లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కన్నాయిగూడెం మండలం బుట్టయిగూడెం లో వెలిసిన CPIML(Maoist) మావోయిస్టుల లేఖల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. అంతేకాకుండా ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన (CM KCR) సీఎం కేసీఆర్ తన ఆరు సంవత్సరాల పాలనలో దళితులను అన్ని రంగాల్లో అణిచివేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల (Redesign of Irrigation Projects) రీ డిజైన్ పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. 

Also Read: Telangana: ఆసుపత్రి నుండి పారిపోయిన కరోనా పేషంట్..

కాగా రాబోయే రోజుల్లో తెరాస (TRS) పార్టీ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారని, పొడుభూమి సాగుచేసుకున్న ఆదివాసీ (Aadivasi) రైతులకు పెట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని, ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం , కన్నాయిగూడెం (Area Commitee) ఏరియా కమిటీ పేరుతో ఈ మావోయిస్టు లేఖ వెలువడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్

Trending News