China Virus: తస్మాత్ జాగ్రత్త.. భారత్ లో అడుగెట్టిన చైనా వైరస్.. తొలి కేసు నమోదు..

China Virus: కరోనా తర్వాత చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన HMPV వైరస్ ఇపుడు భారత దేశాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం చైనా ప్రజలు ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతున్నారు. ఇప్పటికే చైనాలో HMPV వైరస్ వ్యాప్తితో భారత్ అలర్ట్ అవుతోంది. దీంతో పాటు  తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భారత్ లో చైనా వైరస్ అడుగుపెట్టింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 6, 2025, 10:26 AM IST
China Virus: తస్మాత్ జాగ్రత్త.. భారత్ లో  అడుగెట్టిన చైనా వైరస్.. తొలి కేసు నమోదు..

China Virus:  కోవిడ్ తర్వాత HMPV నిర్మాణం  ఈ మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్​ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాజాగా చైనా వైరస్ కు సంబంధించిన తొలి కేసు బెంగుళూరులో సిటీలో ఓ హాస్పిటల్ లో  నమోదు అయింది. ఎనిమిది నెలల పాపకు HMPV వైరస్ డిటెక్ట్ అయినట్టు తెలిపారు. కానీ కర్ణాటక హెల్త్ డిపార్టుమెంట్ మాత్రం మా టెస్టు చేయలేదని చెప్పడం విశేషం. చైనాలో హ్యూమన్‌ మెటానిమోవైరస్‌తో ప్రజలు పెద్ద ఎత్తున హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. దీని లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. అయితే తమ దేశంలో ఈ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు చైనా తెలిపింది.
 
కరోనా మహమ్మారికి మెయిన్ సెంటర్ అయిన చైనాలో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనా వ్యాప్తంగా ఆ దేశం హెల్త్  ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఈ వైరస్‌ సోకినవారిలో కొవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా ప్రత్యేక రిసెర్చ్ సెంటర్ ను ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది.

దాదాపు ఐదేళ్ల క్రితం కొవిడ్‌-19 వ్యాప్తిపై సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం ప్రపంచం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్‌ కారకాలను గుర్తించేందుకు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రకారం డిసెంబరు 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రెండ్రోజుల్లో చైనాలో  300 మంది ఈ వైరస్‌కు బలయినట్టు సమాచారం. పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్‌ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది.

జపాన్‌లో కూడా ఈ వైరల్ వ్యాపించింది.  జపాన్ దేశ వ్యాప్తంగా 7 లక్షల 18 వేల కేసులు నమోదయ్యాయని.. 2024 డిసెంబర్ నెలలోనే 94 వేల 259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశ వ్యాప్తంగా 5 వేల ఆస్పత్రులు, క్లినిక్స్ లో HMPV వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది జపాన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్. వైరస్ బాధితుల్లో అన్ని వయస్సుల వారు ఉన్నారని.. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది.

ప్రధానంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్‌, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్‌ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందంటే.... దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వారికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా, తాకినా వైరస్‌ సోకవచ్చు.
వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్‌ సోకుతుంది.

ప్రధానంగా ఈ వైరస్ తో పిల్లలు,ముసలివారికి, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్‌ఎంపీవీ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జబ్బుపడన వారు తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

మరి ముఖ్యంగా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వొద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే హెచ్‌ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్‌ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు.చైనాలో హెచ్‌ఎంపీవీ వ్యాప్తి తీవ్రమవడంతో భారత్‌ అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్‌ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తున్నది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News