Holidays: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి హాలిడేస్‌..!

Sankranti School holidays: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌ శుక్రవారం నుంచే సంక్రాంతి సెలవులు రానున్నాయి. దీంతో వారికి పండుగ లాంటి వార్త. అవును సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు 10వ తేదీ నుంచే సెలవులు రానున్నాయి. దీంతో ఎగిరి గంతేసే వార్త అవుతుంది.
 

1 /7

విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్‌ పండుగ సెలవులు శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నాయి. దీంతో ఇది వారికి నిజంగా పండుగలాంటి వార్త. ఎప్పుడూ హోమ్‌వర్క్స్‌, ఎగ్జామ్స్‌ అంటూ నీరసించిపోయే విద్యార్థులకు ఇది బంపర్‌ గుడ్‌న్యూస్‌..  

2 /7

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా దాదాపు పదిరోజులు ఈ సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నారు. ఫైనల్‌ ఎగ్జామ్స్‌కు ముందు ఇంత భారీ సెలవులు ఇవే చివరివి.   

3 /7

అంతేకాదు సంక్రాంతి పండుగ అంటేనే సంబురాలు చేసుకునే పండుగ. చిన్నాపెద్దా అంతా ఈ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. పండుగ సెలవులను కూడా తీసుకువస్తుంది.  

4 /7

సంక్రాంతి పండుగకు ఎక్కడ ఉన్న సొంత ఊళ్లకు చేరుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఎంతో ఆనందంగా నిర్వహిస్తారు. భోగి పండుగతో ప్రారంభం అయ్యే సంక్రాంతి ఉత్సవాలు కనుమ పండుగతో ముగుస్తుంది.   

5 /7

అయితే, ఆంధ్రప్రదేశ్‌ అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం ఈనెల 10వ తేదీ శుక్రవారం నుంచి ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతున్నాయి అని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

6 /7

19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అంటే స్కూళ్లు తిరిగి జనవరి 20వ తేదీ తెరుచుకుంటాయి. ఇవి సాధారణ స్కూళ్లకు ఉన్నాయి. అయితే, క్రిస్టియన్‌ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సెలవులు.  

7 /7

అయితే, గత ఏడాది చివర్లో సంక్రాంతి సెలవులు కుదిస్తారు. ఎందుకంటే భారీ ఎత్తున వర్షాలు పండుగలు నేపథ్యంలో సెలవులు ఇచ్చారు. మార్చి ఎగ్జామ్స్‌ దగ్గర పడుతున్నాయి కాబట్టి సంక్రాంతి సెలవులు కుదిస్తారనే ప్రచారం కూడా జరిగింది.