COVID-19 cases: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో ఎంతంటే..

Coronavirus positive cases in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు అదుపులో ఉన్నట్టుగా కనిపించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,909 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో (COVID-19 cases in Maharashtra) పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండగా తమిళనాడు, కర్ణాటకలోనూ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2021, 12:45 PM IST
COVID-19 cases: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో ఎంతంటే..

Coronavirus positive cases in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు అదుపులో ఉన్నట్టుగా కనిపించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,909 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 487 కేసులు ఉండగా ఆ తర్వాత మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లాలో 289, రంగారెడ్డి జిల్లాలో 225 చొప్పున కరోనా కేసులు ఉన్నట్టు తేలింది. శుక్రవారం రాత్రి వరకు ఉన్న నివేదికల ప్రకారం అంతకు ముందు 24 గంటల్లో 1,11,726 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో 584 మంది కరోనావైరస్ నుంచి కోలుకోగా, అదే సమయంలో మరో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాబారిన పడిన వారి సంఖ్య మొత్తం 3.24 లక్షలకు చేరగా, 3.04 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1752 మంది కరోనాతో చనిపోయారు.  ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 17,791 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా (COVID-19 second wave symptoms) లేని 11,495 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉండి కరోనాకు చికిత్స పొందుతుండగా మిగతా వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 

Also read : Kishan Reddy: కోవిడ్-19 వ్యాక్సిన్లకు కొరత లేదు, ఏ టీకా తీసుకున్నా నష్టం లేదన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఇదిలావుంటే దేశంలో అనేక చోట్ల కరోనా కట్టడి కోసం నైట్ కర్ఫ్యూ (Night curfew), కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, పరిమిత సమయాల్లోనే రహదారులపైకి వాహనాలకు అనుమతి వంటి ఆంక్షలు విధించి చర్యలు తీసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో (COVID-19 cases in Maharashtra) పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండగా తమిళనాడు, కర్ణాటకలోనూ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News